ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sensex Nifty: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ నష్టం

ABN, First Publish Date - 2023-07-21T17:19:47+05:30

ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌యుఎల్ వంటి ఇండెక్స్ దిగ్గజాల స్టాక్స్ పతనంతో వరుసగా 6 రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1.31 శాతం లేదా 900 పాయింట్ల మేర నష్టపోయి 66,684 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక వరుస లాభాల క్రమంలో 20 వేల మార్క్‌ను తాకుతుందని భావించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం ఏకంగా 1.17 శాతం లేదా 234 పాయింట్లు క్షీణించి 19,745 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.304 లక్షల కోట్ల నుంచి రూ.302.1 లక్షల కోట్లకు పడిపోయింది.

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతమైన శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌యుఎల్ వంటి ఇండెక్స్ దిగ్గజాల స్టాక్స్ పతనంతో వరుసగా 6 రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1.31 శాతం లేదా 900 పాయింట్ల మేర నష్టపోయి 66,684 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక వరుస లాభాల క్రమంలో 20 వేల మార్క్‌ను తాకుతుందని భావించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం ఏకంగా 1.17 శాతం లేదా 234 పాయింట్లు క్షీణించి 19,745 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.304 లక్షల కోట్ల నుంచి రూ.302.1 లక్షల కోట్లకు పడిపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్లు ఒక్క శుక్రవారం సెషన్‌లోనే ఏకంగా రూ.1.9 లక్షల కోట్ల మేర నష్టపోయారు.

ఐటీ సెక్టార్ స్టాకులు భారీ నష్టాల్లో ముగియడంతోపాటు జూన్ త్రైమాసికం ఫలితాలు కొంతమేర ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్‌యుఎల్ షేర్లు క్యు1 ఫలితాల ప్రభావంతో నష్టానికి గురయ్యాయి. ఇక ఫలితాల విడుదలకు ముందు రిలయన్స్ షేర్లు పతనమవ్వడం గమనార్హం. మరోవైపు గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్ల సెంటిమెంట్‌కు దెబ్బతీసిందని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. కాగా.. శుక్రవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నప్పటికీ వారంపరంగా చూస్తే సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతం లాభంతో ముగియడంతో గమనార్హం.

Updated Date - 2023-07-22T10:11:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising