ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

fixed deposits: సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ అందిస్తున్న 3 బ్యాంకులు ఇవే..

ABN, First Publish Date - 2023-03-25T16:12:18+05:30

వృద్ధుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు కాస్త అధికంగానే అందిస్తుంటాయి. అయితే ఈ మూడు బ్యాంకులు మాత్రం చాలా బ్యాంకుల కంటే ఎక్కువగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వృద్ధుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (Fixed deposites) వడ్డీ రేట్లను (Interest rates) బ్యాంకులు కాస్త అధికంగానే అందిస్తుంటాయి. చక్కటి ఆఫర్లతో ఖాతాదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి. ఇందుకనుగుణంగా ఆర్‌బీఐ (RBI) రెపో రేటు (Repo rate) పెంచిన మే 2022 నాటి నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను క్రమంగా పెంచుతూనే ఉన్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇది అనువైన సమయం. అన్ని బ్యాంకులూ వడ్డీ రేట్లను పెంచుతున్నప్పటికీ చాలా పెద్ద బ్యాంకుల కంటే కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 9 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ బ్యాంకులు డీఐసీజీసీ (DICGC) బ్యాంకులే. అంటే ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకైనా సరే రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు ప్రభుత్వ ఇన్సూరెన్స్ ఉంటుంది. కాగా 9 శాతం కంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తున్న టాప్-3 బ్యాంకులేవో ఒకసారి పరిశీలిద్దాం...

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Unity Small Finance Bank) వృద్ధుల ఫిక్స్‌డ్ టర్మ్ డిపాజిట్లపై 4.5 శాతం నుంచి 9.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 1001 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై అత్యధికంగా 9.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇక 181-201 రోజుల టెన్యూర్‌పై 9.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఫిబ్రవరి 15, 2023 నుంచి ఈ రేట్లు వర్తింపజేస్తోంది. కాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లను మెచ్యూరిటీకి ముందుగానే విత్‌డ్రా చేసుకుంటే 1 శాతం ప్రిమెచ్యూర్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా తక్కువనే చెప్పాలి.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్...

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Utkarsh Small Finance Bank) సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ టర్మ్ డిపాజిట్లపై 4.75 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. అత్యధికంగా 700 రోజుల కాలపరిమితిపై 9 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఫిబ్రవరి 27, 2023 నుంచి ఈ రేట్లు వర్తిస్తున్నాయి. ముందుగా విత్‌డ్రా చేసుకుంటే 1 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Fincare Small Finance Bank) సీనియర్ సిటిజన్లకు రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.60 శాతం నుంచి 9.01 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తోంది. అత్యధిక వడ్డీ రేటు 9.01 శాతాన్ని 1001 రోజుల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అందిస్తోంది. ఈ బ్యాంకు వడ్డీ రేట్లు మార్చి 24, 2023 నుంచి వర్తిస్తున్నాయి.

Updated Date - 2023-03-25T16:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising