Tax Saving Ways: కష్టార్జితంలో ట్యాక్సుల నుంచి మినహాయింపు పొందగలిగే ఉత్తమ మార్గాలు ఇవే..
ABN, Publish Date - Dec 25 , 2023 | 06:01 PM
భారత్‌లో ఆస్తులు, డబ్బు, ఆదాయాలపై ప్రభుత్వం పన్నులు విధిస్తుందన్న విషయం తెలిసిందే. అది వ్యక్తిగతమైనా లేదా కార్పొరేటు ఆదాయమైనా ప్రభుత్వ చట్టాల ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తులు లేదా వ్యాపాలరాలకు సంబంధించిన సంపద కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది.
న్యూఢిల్లీ: భారత్‌లో ఆస్తులు, డబ్బు, ఆదాయాలపై ప్రభుత్వం పన్నులు విధిస్తుందన్న విషయం తెలిసిందే. అది వ్యక్తిగతమైనా లేదా కార్పొరేటు ఆదాయమైనా ప్రభుత్వ చట్టాల ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తులు లేదా వ్యాపాలరాలకు సంబంధించిన సంపద కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. అయితే చెల్లింపుదారులు తమ కష్టార్జితంలో కొంతమేర పన్నుల నుంచి మినహాయింపు పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆదాయ పన్నుల చట్టాల కింద చట్టబద్ధంగా పన్నుల రేట్లు తగ్గించుకునే అవకాశాలున్నాయి. ఆ నిబంధనలు ఏంటో మీరూ ఓ లుక్కేయండి.
సెక్షన్ 80సీ, 80సీసీసీ, 80సీసీడీ కింద మినహాయింపు..
కేటాయించిన ప్రత్యేక మార్గాల్లో పెట్టుబడుల ద్వారా సిటిజన్లు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది.
మెడికల్ వ్యయాలు (సెక్షన్ 80డీ)
నెలవారీ జీతాలు పొందే ఉద్యోగులు మెడికల్ ఇన్సూరెన్సులపై పన్ను మినహాయింపు పొందొచ్చు. తనపై ఆధారపడిన భాగస్వాములు, పిల్లలు, సీనియర్ సిటిజన్లపై చేసే మెడికల్ వ్యయాలపై రూ.50 వేల వరకు ట్యాక్స్ మినహాయింపును పొందే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది.
గృహ రుణం (సెక్షన్ 24)
గృహ రుణాలు చెల్లిస్తున్న పన్ను చెల్లింపుదారులు వడ్డీ చెల్లింపుపై కొంత ఉపశమనం పొందేందుకు వీలుంది. రూ.2 లక్షల వరకు ఉపశమనాన్ని పొందే మార్గాలున్నాయి.
ఎడ్యుకేషన్ లోన్ (సెక్షన్ 80ఈ)
విద్యా రుణం తీసుకునే వ్యక్తులు పన్ను నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇందుకు గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు.
షేర్లు, మ్యూచువల్ ఫండ్లు (సెక్షన్ 80సీసీజీ)
ఏడాదికి రూ.12 లక్షల కంటే తక్కువ ఆదాయాన్ని పొందే వ్యక్తులు ప్రత్యేక షేర్లు, రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీమ్ కింద మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అదనపు మినహాయింపులు (డిడక్షన్లు) పొందొచ్చు. కేటాయించిన ప్రత్యేక మార్గాల్లో లాభాలను పున: పెట్టుబడులు పెట్టడం ద్వారా చెల్లింపుదారులు పన్ను భారాలను కొంతమేర తగ్గించుకోవచ్చు. ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా ఒక ఏడాది కంటే ఎక్కువకాలం అట్టిపెట్టుకున్న షేర్లపై వచ్చే లాభాలపై పన్ను మినహాయించడం కల్పిస్తోంది.
విరాళాలు (సెక్షన్ 80జీ, 80జీజీసీ)
సామాజిక కార్యక్రమాలు లేదా రాజకీయ పార్టీలకు విరాళాలు అందించే చెల్లింపుదారులు తాము చెల్లించే మొత్తంలో 50 శాతంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఎన్‌జీవోలు లేదా రాజకీయ పార్టీలు అందించే సర్టిఫికేట్ సమర్పించి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంటి అద్దె భత్యం (సెక్షన్ 80జీజీ)
ఉద్యోగులు సెక్షన్ 80జీజీ కింద హౌస్ రెంట్ అలవెన్స్‌ని (హెచ్‌ఆర్ఏ క్లెయిమ్ చేయవచ్చు. వార్షిక అద్దె రూ.1 లక్ష దాటితే ఉపశమనం లభిస్తుంది. యజమాని పాన్‌కార్డు, లీజు అగ్రిమెంట్ ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.
లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ)
సెలవు సమయాల్లో ప్రయాణాల ద్వారా ఉద్యోగ కంపెనీలు లేదా యజమానుల నుంచి ఎల్‌టీఏ పొందవచ్చు. ఇండియాలో ప్రయాణించి పన్ను రహిత ఎల్‌టీఏను క్లెయిమ్ చేయవచ్చు. నాలుగు సంవత్సరాల్లో రెండుసార్లు ఇది వర్తిస్తుంది. జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేయవచ్చు.
Updated Date - Dec 25 , 2023 | 06:01 PM