Money investment: లక్ష రూపాయల ఇన్వెస్ట్‌మెంట్ మూడేళ్లలో అద్భుతమే చేసింది.. ఎంత పెరిగిందో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-04-24T19:15:55+05:30
తక్కువ మొత్తం పెట్టుబడి (investment) అనతికాలంలోనే చక్కటి లాభాలను అందిస్తే అంతకుమించిన సంతోషం ఇంకేముంటుంది...
ముంబై: తక్కువ మొత్తం పెట్టుబడి (investment) అనతికాలంలోనే చక్కటి లాభాలను అందిస్తే అంతకుమించిన సంతోషం ఇంకేముంటుంది. మెషిన్ ఇంజనీరింగ్ కంపెనీ ‘బట్లిబోయ్ లిమిటెడ్’లో (Batliboi Ltd) ఇన్వెస్ట్ చేసిన మదుపరులంతా ప్రస్తుతం ఇలాంటి ఆనందానికే గురవుతున్నారు. ఎందుకంటే కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే ఈ కంపెనీ షేర్లు ఏకంగా 709 శాతం మేర వృద్ధి చెందాయి. 23 ఏప్రిల్ 2020న బీఎస్ఈపై ఒక్కో షేరు కేవలం రూ.7.83గా ముగియగా... 24 ఏప్రిల్ 2023న (సోమవారం) ఈ స్టాక్ విలువ ఏకంగా రూ.66.30కు వృద్ధి చెందింది. సోమవారం బీఎస్ఈ ట్రేడింగ్‌లో 3.17 శాతం వృద్ధితో రూ.65 వద్ద ఓపెన్ అయ్యింది. గరిష్ఠంగా రూ.66.30ను తాకింది.
అంటే మూడేళ్లక్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడది ఏకంగా రూ.8.46 లక్షలు అయ్యుండేది. ఇదే కాలంలో సెన్సెక్స్ 91 శాతం పెరగగా ఈ స్టాక్ మాత్రం ఏకంగా 709 శాతం లాభపడింది. ఈ ఏడాదిలో ఈ స్టాక్ 51.2 శాతం పెరగగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 38 శాతం మేర వృద్ధి చెందింది. బీఎస్ఈపై రూ.26.37 లక్షల విలువైన 0.4 లక్షల కంపెనీ షేర్లు చేతులు మారాయి. కాగా బీఎస్ఈపై ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.190.65 కోట్లుగా ఉంది. మార్చి 2023 నాటికి 12 మంది ప్రమోటర్లకు 74.47 శాతం వాటా ఉండగా... 9705 మంది పబ్లిక్ షేర్ హోల్డర్లు 25.53 శాతం వాటాను కలిగివున్నారు. ఇక ఈ కంపెనీ లాభాల బాటలో పయనిస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 578.57 శాతం మేర పెరిగి రూ.7.60 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.1.12 కోట్లుగా ఉంది.
ఇవి కూడా చదవండి...
Habitats on moon: చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు దిశగా చైనా కీలక అన్వేషణ!.. ఏం చేయబోతుందో తెలుసా.. ఇదే కానీ జరిగితే...
World War II Ship: సముద్ర గర్భంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి నౌక గుర్తింపు..
Updated Date - 2023-04-24T19:17:56+05:30 IST