Twitter Vs Meta: ట్విట్టర్, మెటా మధ్య ముదురుతున్న డేటా చోరీ వివాదం.. ‘న్యాయనిపుణులు’ ఏమంటున్నారంటే..
ABN, First Publish Date - 2023-07-08T16:38:55+05:30
మెటా సంస్థ తన కొత్త మైక్రో బ్లాగింగ్ సైట్ ‘థ్రెడ్స్’ రూపొందించేందుకు వ్యాపార రహస్యాలను దొంగిలించిందని ట్విట్టర్ ఆరోపిస్తున్న విసయం తెలిసిందే. ఈ విషయంలో ట్విట్టర్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రెండు దిగ్గజ సోషల్ మీడయా ఫ్లాట్‌ఫారమ్‌ల మధ్య తొలి లీగల్ బ్యాటిల్ కావొచ్చు. అయితే ట్విట్టర్ గనక మెటాపై దావా వేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది నిపుణులు అంటున్నారు.
మెటా(Meta) సంస్థ తన కొత్త మైక్రో బ్లాగింగ్ సైట్ (Microblogging Site)‘థ్రెడ్స్’ (Threads) రూపొందించేందుకు వ్యాపార రహస్యాలను దొంగిలించిందని ట్విట్టర్ (Twitter) ఆరోపిస్తున్న విసయం తెలిసిందే. ఈ విషయంలో ట్విట్టర్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రెండు దిగ్గజ సోషల్ మీడియా(Social Media) ఫ్లాట్‌ఫారమ్‌ల మధ్య తొలి లీగల్ బ్యాటిల్(Legal Battle) కావొచ్చు. అయితే ట్విట్టర్ గనక మెటాపై దావా వేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.
మెటాపై ఆరోపణలు చేస్తూ బుధవారం ట్విట్టర్ ఓ లేఖ విడుదల చేసింది. మెటా తమ వ్యాపార రహస్యాలను ఉపయోగించి తన కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‘థ్రెడ్స్’ ని రూపొందించిందని.. వెంటనే తన సమాచారాన్ని వినియోగించడం నిలిపివేయాలని పేర్కొంది. తన కంపెనీని నుంచి తొలగించిన డజన్లకొద్ది మాజీ ఉద్యోగులను మెటా సంస్థ నియమించిందని ఆరోపించింది. మెటా రిక్రూట్ చేసుకున్న ట్విట్టర్ మాజీ ఉద్యోగుల్లో చాలామంది సంస్థకు చెందిన పరికరాలు, డాక్యుమెంట్లను అక్రమంగా కలిగి ఉన్నారని తెలిపింది. మెటా వారిని ఉద్దేశపూర్వకంగానే పనిచేయడానికి కేటాయించిందని ట్విట్టర్ లేఖలో పేర్కొంది. అయితే న్యాయపరమైన చర్యలకు దావా వేస్తుందా లేదా అనేది దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇదే విషయంపై ట్విట్టర్ ప్రతినిధి నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. అయితే ‘‘ఏ ఒక్క ట్విట్టర్ మాజీ ఉద్యోగి కూడా తన సంస్థలో నియమించలేదని’’ మెటా ప్రతినిధి అండీ స్టోన్ గురువారం థ్రెడ్స్ పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు. దీనిపై న్యాయ నిపుణులు స్పందిస్తూ చాలా కంపెనీలు తమ పోటీదారులపై ఆరోపణలు చేయడం సహజం. ఉద్యోగుల నియామకం, సంస్థల పరికరాల చోరీ, వ్యాపార రహస్యాలను దొంగిలించడం వంటి ఆరోపణలు చేస్తుంటాయి.. కానీ అవి నిరూపించడం చాలా కష్టం అని న్యాయ నిపుణులు తెలిపారు.
‘‘దావా వేసి విజయం సాధించాలాంటే.. ప్రత్యర్థి కంపెనీ సమాచారం దొంగిలించినట్లుగా నిరూపించాలి..ఇది చాలా కష్టంతో కూడుకున్నది’’ అని పెన్సిల్వేనియా యూనివర్సిటీ లా ప్రొఫెసర్ పోల్క్ వ్యాగ్నర్ తెలిపారు.
Updated Date - 2023-07-08T19:00:01+05:30 IST