ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Twitter: ట్విట్టర్‌లో మరో కొత్త ఫీచర్.. రాతగాళ్లకు సువర్ణావకాశం..!!

ABN, First Publish Date - 2023-07-19T21:30:08+05:30

ఇన్ స్ట్రాగ్రామ్, థ్రెడ్‌ వంటి ప్లాట్‌ఫారాల నుంచి పోటీని తట్టుకునేందుకు ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. తాజాగా ‘ఆర్టికల్స్’ పేరుతో ట్విట్టర్ కొత్త ఫీచర్‌ను త్వరలో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా పెద్ద వ్యాసాలను కూడా ట్వీట్ చేసుకునే అవకాశం ఉంటుందని ఎలన్ మస్క్ వెల్లడించారు. ఈ ఫీచర్ రాతగాళ్లకు సువర్ణావకాశమని ఆయన అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియా (Social Media) దిగ్గజం ట్విట్టర్ (Twitter) వినియోగదారుల కోసం మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ నెటిజన్‌లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ స్ట్రాగ్రామ్ (Instagram), థ్రెడ్‌ (Thread) వంటి ప్లాట్‌ఫారాల నుంచి పోటీని తట్టుకునేందుకు ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. తాజాగా ‘ఆర్టికల్స్’ (Articles) పేరుతో ట్విట్టర్ కొత్త ఫీచర్‌ను త్వరలో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ (Feature) ద్వారా పెద్ద వ్యాసాలను కూడా ట్వీట్ చేసుకునే అవకాశం ఉంటుందని ఎలన్ మస్క్ వెల్లడించారు. ఈ ఫీచర్ రాతగాళ్లకు సువర్ణావకాశమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్వీట్ చేయాలంటే 280 అక్షరాలకు మాత్రమే అనుమతి ఉంది. బ్లూ టిక్ కొనుగోలు చేసిన వినియోగదారులకు 10వేల అక్షరాల వరకు రాసుకునే అవకాశం ఉంది. అయితే ఆర్టికల్స్ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉంటుందా లేదా బ్లూ టిక్ తీసుకున్న వారికే ఉంటుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆర్టికల్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులు సుదీర్ఘమైన, క్లిష్టమైన కథనాలను కూడా ట్వీట్ చేసుకోవడంతో పాటు బుక్‌లోని కంటెంట్ మొత్తాన్ని కూడా ట్వీట్ చేయవచ్చని సమాచారం. తొలుత ఈ ఫీచర్ కెనడా, ఘనా, యూకే, యూఎస్‌లోని ఎంపిక చేసిన వినియోగదారులకు గత ఏడాది జూన్‌లో అందుబాటులోకి వచ్చింది.


కాగా ట్విట్టర్‌కు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో వినియోగదారులు ఉన్నారు. వీరిలో అనేక మంది కంటెంట్ రైటర్స్ ఉన్నారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా పలు దేశాల్లో కంటెంట్ క్రియేటర్లు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఆర్టికల్స్ ఫీచర్ అందుబాటులోకి తేవడం సంక్లిష్టమైన, మీడియా రిచ్ కథనాలను పంచుకోవడానికి వీలు కల్పిస్తుందని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ఈ ఫీచర్ ఫోటోలు, వీడియోలు, జిఐఎఫ్ వంటి మీడియా అప్‌లోడ్‌లకు సపోర్ట్ చేస్తుందని ఆయన తెలిపారు.

మరోవైపు కంటెంట్ క్రియేట్లరకు డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కూడా ట్విట్టర్ అందిస్తోంది. ‘హైలైట్స్’ అనే ఫీచర్ ద్వారా ట్విట్టర్ యూజర్లు తమకు నచ్చిన ట్వీట్‌లను ప్రత్యేక ట్యాబ్‌లో యాడ్ చేసుకుని సపరేట్‌గా చూడవచ్చు. దీని కోసం ట్వీట్‌లో కుడివైపు పైభాగంలో మూడు చుక్కలు ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే దానిలో యాడ్ లేదా రిమూవ్ ఫ్రమ్ హైలైట్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ట్వీట్‌లను యాడ్ చేయవచ్చు లేదా ఉన్నవాటిని రిమూవ్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ బ్లూటిక్ కలిగిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి: Viral Video: ఈ పిల్లికి మరీ ఇంత అసూయ ఎందుకో.. యజమాని పట్టించుకోలేదని చివరకు ఏం చేసిందో చూడండి

Updated Date - 2023-07-19T21:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising