Yamaha Blue Square: హైదరాబాద్‌లో యమహా బ్లూ స్కేర్ ఔట్‌లెట్లు
ABN, First Publish Date - 2023-05-02T21:10:37+05:30
దేశవ్యాప్తంగా బ్లూ స్క్వేర్ షోరూములు ఏర్పాట్లు చేస్తున్న ఇండియా యమహా మోటార్ (IYM)
హైదరాబాద్: దేశవ్యాప్తంగా బ్లూ స్క్వేర్ షోరూములు ఏర్పాట్లు చేస్తున్న ఇండియా యమహా మోటార్ (IYM) తాజాగా హైదరాబాద్‌లో నూతన బ్లూ స్క్వేర్ ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. నగరంలోని అత్తాపూర్‌లో ఏస్ మోటార్స్ (Ace Motors) పేరుతో, ఆర్సీ పురంలో రాఘవేంద్ర మోటార్స్ పేరుతో సేల్స్, సర్వీసెస్ షోరూములు ప్రారంభించింది.
బ్లూ స్క్వేర్ షోరూముల్లో మాత్రమే విక్రయించే మ్యాక్సీ స్పోర్ట్స్ ఏరాక్స్ 155 స్కూటర్‌తో పాటు ఈ ప్రీమియం ఔట్‌లెట్స్‌లో ఏబీఎస్‌తో వైజడ్‌ఎఫ్-ఆర్15 వెర్షన్ 4.0 (155సీసీ); ఏబీఎస్‌తో వైజడ్‌ఎఫ్- ఆర్15ఎస్ వెర్షన్ 3.0 (155 సీసీ), ఏబీఎస్‌తో ఎంటీ-15 (155 సీసీ) వెర్షన్ 2.0, బ్లూ కోర్ టెక్నాలజీ ఆధారిత మోడల్స్ అయిన ఎఫ్‌జెడ్ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఫేజర్ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్1 (149 సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జెడ్-ఎఫ్1(14సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జెడ్–ఎక్స్(149సీసీ) ఏబీఎస్‌తో మరియు యుబీఎస్ ఆధారిత స్కూటర్లు అయిన ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ (125సీసీ), రేజెడ్‌ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ (125సీసీ), స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ (125సీసీ) ఉంటాయి. ఈ ప్రీమియం ఔట్‌లెట్స్‌లో అత్యంత ఆకర్షణీయంగా యమహా యాక్ససరీలు, అప్పారెల్స్, విడిభాగాలు కూడా ప్రదర్శిస్తారు.
నూతనంగా ప్రారంభించిన ఔట్‌లెట్లతో కలిపి నగరంలో యమహా మొత్తం ఎనిమిది బ్లూ స్క్వేర్ ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం, ఛత్తీస్‌గఢ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జమ్మూకశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలలో మొత్తంగా 180 బ్లూ స్క్వేర్ షోరూములు ఉన్నాయి.
Updated Date - 2023-05-02T21:10:37+05:30 IST