The Call Of The Blue: హైదరాబాద్‌లో ‘కాల్ ఆఫ్ ద బ్లూ వీకెండ్’
ABN, First Publish Date - 2023-01-24T21:01:36+05:30
యమహా ఇండియా గ్రూప్ ఈ ఏడాది తమ మొట్టమొదటి వీకెండ్ యాక్టివిటీ ‘ద కాల్ ఆఫ్ ద బ్లూ’ వీకెండ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులోనున్న
హైదరాబాద్: యమహా ఇండియా గ్రూప్ ఈ ఏడాది తమ మొట్టమొదటి వీకెండ్ యాక్టివిటీ ‘ద కాల్ ఆఫ్ ద బ్లూ’ వీకెండ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులోనున్న జలవిహార్ వాటర్ పార్క్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంల 1300 మంది యమహా అభిమానులు, బ్లూ స్ట్రీక్స్ (యమహా యజమానులతో కూడిన కమ్యూనిటీ) నుంచి 1000 మందికిపైగా రైడర్లు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా జింఖానా రైడ్ లాంటి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారు తమ ప్రతిభను ప్రదర్శించడంతోపాటు తమ సవారీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం కలిగింది. టెస్ట్ రైడ్ కార్యకలాపాలతో పాటు యమహా ఉత్పత్తి శ్రేణి, యాక్సెసరీలు, అప్పారెల్స్ జోన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. స్టైలింగ్ జోన్ ఇందులో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో వినియోగదారులు ఫేస్ పెయింటింగ్, టాటూ ఆర్ట్‌లో లీనమయ్యారు. కాగా, ‘ద కాల్ ఆఫ్ ద బ్లూ వీకెండ్’ ఈవెంట్లను యమహా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఏడాదంతా నిర్వహిస్తూ ఉంటుంది.
‘ద కాల్ ఆఫ్ ద బ్లూ’ వీకెండ్ యాక్టివిటీతో యమహా దేశవ్యాప్తంగా తమ శ్రేణి, స్పోర్టీ మోడల్స్‌ను ప్రదర్శిస్తుంది. వీటిలో ఏబీఎస్‌తో వైజెడ్‌ఎఫ్–ఆర్15 వెర్షన్ 4.0 (155సీసీ), ఏబీఎస్‌తో వైజెడ్‌ఎఫ్-ఆర్15ఎస్ వెర్షన్ 3.0 (155 సీసీ), ఏబీఎస్‌తో ఎంటీ-15 (155 సీసీ) వెర్షన్ 2.0, బ్లూ కోర్ టెక్నాలజీ ఆధారిత మోడల్స్ అయిన ఎఫ్‌జెడ్ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఫేజర్ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్1 (149 సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జెడ్-ఎఫ్1(14సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జెడ్-ఎక్స్(149సీసీ) ఏబీఎస్‌తో, యూబీఎస్ ఆధారిత స్కూటర్లు అయిన ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ (125సీసీ), రేజెడ్‌ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ (125సీసీ), స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ (125సీసీ) ఉంటాయి.
Updated Date - 2023-01-24T21:01:37+05:30 IST