ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నదీ తీరంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు!

ABN, First Publish Date - 2023-01-24T19:47:07+05:30

మహారాష్ట్రలోని పూణె(Pune)లో నదీ తీరంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణె: మహారాష్ట్రలోని పూణె(Pune)లో నదీ తీరంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. మృతుల్లో పెద్ద వయసు దంపతులు, వారి కుమార్తె, అల్లుడు, వారి ముగ్గురు మనవళ్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నాలుగు మృతదేహాలను సోమవారం స్వాధీనం చేసుకోగా, మూడింటిని మంగళవారం గుర్తించారు. పూణెకు 45 కిలోమీటర్ల దూరంలో భీమా నది(Bheema River)పై ఉన్న పార్గావ్ వంతెన వద్ద వీరి మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.

మృతదేహాలు భీమా నది ఒడ్డున ఒకదానికొకటి 200-300 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడి ఉన్నట్టు పేర్కొన్నారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారన్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. ఆత్మహత్య సహా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Updated Date - 2023-01-24T19:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising