CM residence: సీఎం నివాసానికి బాంబు బెదిరింపు
ABN, First Publish Date - 2023-08-20T07:47:25+05:30
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) నివాసగృహంలో బాంబులు పేలనున్నాయంటూ బెదిరించిన కన్నియాకుమారికి
- కన్నియాకుమారివాసి అరెస్టు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) నివాసగృహంలో బాంబులు పేలనున్నాయంటూ బెదిరించిన కన్నియాకుమారికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని పోలీసు కంట్రోల్‌రూమ్‌కు శనివారం వేకువజాము గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చిత్తరంజన్‌రోడ్డులోని ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసగృహంలో బాంబులు ఉన్నాయని, కాసేపట్లో అవి పేలనున్నాయని తెలిపి ఫోన్ కట్ చేశాడు. వెంటనే పోలీసుకంట్రోల్ రూమ్ అధికారులు తేనాంపేట పోలీసులకు సమాచారం తెలిపి అప్రమత్తం చేశారు. వెంటనే స్థానిక పోలీసులు బాంబు స్క్వాడ్(Bomb squad), పోలీసు జాగిలాలతో వెళ్ళి ముఖ్యమంత్రి నివాసగృహంలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు అది ఉత్తుత్తి బాంబు బెదిరింపేనని తెలుసుకున్నారు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్‌లో నమోదైన సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా బాంబు బెదరింపు చేసింది కన్నియాకుమారికి చెందిన ఇసక్కి ముత్తు అని కనుగొన్నారు. వెంటనే కన్నియాకుమారి పోలీసులకు ఆ సమాచారాన్ని పంపటంతో అక్కడి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇసక్కిముత్తు మానసిక రోగిగా ఉన్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
Updated Date - 2023-08-20T07:47:25+05:30 IST