Sarpancha: ఆహా.. ఈ సర్పంచ తెలివి మామూలుగా లేదుగా.. ఒకటికాదు రెండుకాదు.. మొత్తం రూ.49 లక్షలు..
ABN, First Publish Date - 2023-06-10T11:18:02+05:30
ఉపాధి హామీ పథకంలో రూ.49 లక్షల అవినీతికి పాల్పడిన కారమడై యూనియన్ మరుదూర్ సర్పంచుపై విజిలెన్స్ పోలీసులు కేసు నమోదు చేశా
పెరంబూర్(చెన్నై): ఉపాధి హామీ పథకంలో రూ.49 లక్షల అవినీతికి పాల్పడిన కారమడై యూనియన్ మరుదూర్ సర్పంచుపై విజిలెన్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కో యంబత్తూర్ జిల్లా మరుదూర్ సర్పంచు(Sarpancha)గా పూర్ణిమ వ్యవహరిస్తున్నారు. 100 రోజుల ఉపాధి హామీ పథకంలో లబ్ధిదారుల ఎంపిక సర్పంచు నేతృత్వంలో జరుగుతోంది. ప్రైవేటు కర్మాగారాల్లో పనిచేసే వ్యక్తులు, మృతి చెందిన పలువురిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి గుర్తింపుకార్డులు అందజేసినట్లు సర్పంచుపై ఫిర్యాదులందాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు, ఈ పథకంలో సుమారు రూ.49 లక్షలు అవినీతి జరిగిందని పేర్కొంటూ, పూర్ణిమపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2023-06-10T11:18:02+05:30 IST