ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Notification: కాళోజీ అనుబంధ కళాశాలల్లో నర్సింగ్‌ డిగ్రీలకు ప్రవేశాలు

ABN, First Publish Date - 2023-08-23T13:03:17+05:30

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌స(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌)- బీఎస్సీ నర్సింగ్‌, పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌స(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌)- బీఎస్సీ నర్సింగ్‌, పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ అనుబంధ నర్సింగ్‌ కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ కోటా కింద ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో మొత్తం సీట్లు; ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీల్లో 60 శాతం సీట్లు అలాట్‌ చేస్తారు. ప్రతి ప్రోగ్రామ్‌లో 85 శాతం సీట్లను స్థానికులకు కేటాయించారు. మిగిలిన 15 శాతం సీట్లకు స్థానికులు సహా స్థానికేతర అభ్యర్థులందరూ పోటీపడవచ్చు. కౌన్సెలింగ్‌ నాటికి సీట్ల వివరాలు ప్రకటిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీఎస్సీ నర్సింగ్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్‌/పన్నెండోతరగతి ఉత్తీర్ణులు; ఇంటర్‌ ఒకేషనల్‌తోపాటు బయాలజీ అండ్‌ ఫిజికల్‌ సైన్సె్‌సలో బ్రిడ్జ్‌ కోర్సు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐఎ్‌సఎ్‌ససీఈ/ఐసీఎ్‌సఈ/ఎ్‌సఎ్‌ససీఈ/హెచ్‌ఎ్‌ససీఈ/ఎన్‌ఐఓఎ్‌స/ఏపీఓఎ్‌సఎస్‌ అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. సైన్స్‌ సబ్జెక్టుల్లో జనరల్‌ అభ్యర్థులకు 45 శాతం; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. టీఎస్‌ ఎంసెట్‌ 2023 ర్యాంక్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. జనరల్‌ కేటగిరీలో 53257; ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో 63908; జనరల్‌ దివ్యాంగుల కేటగిరీలో 58582 లోపు ర్యాంక్‌ సాధించి ఉండాలి.

పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. గుర్తింపు పొందిన బోర్డు/ఎన్‌ఐఓఎ్‌స/ఏపీఓఎ్‌సఎస్‌ నుంచి ఇంటర్‌/పన్నెండోతరగతి ఉత్తీర్ణతతోపాటు జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కోర్సు పూర్తిచేసి స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 2023 డిసెంబరు 31 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్‌ మెరిట్‌/జీఎన్‌ఎం మార్కుల ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య సమాచారం

రిజిస్ట్రేషన్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.2500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 31

వెబ్‌సైట్‌: knruhs.telangana.gov.in

Updated Date - 2023-08-23T13:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising