ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Education: టెన్త్ పరీక్షల్లో మళ్లీ మార్పులు! తెలుగులో కాంపోజిట్‌ రద్దు

ABN, First Publish Date - 2023-08-09T13:02:36+05:30

పదో తరగతి పరీక్షల విధానాన్ని ప్రభుత్వం సమూలంగా మార్చింది. పరీక్ష ప్రశ్న పత్రాల నుంచి నిర్వహణ వరకు సంస్కరణలు అమలు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉపాధ్యాయ సంఘాల నేతలతో విజయవాడలో నిర్వహించిన చర్చల్లో సర్కారు నిర్ణయాలను

2 రోజులపాటు సైన్స్‌ పరీక్షలు

తెలుగులో కాంపోజిట్‌ రద్దు

పదో తరగతి పరీక్షల్లో సంస్కరణలు

ఉపాధ్యాయ సంఘాల నేతలతో బొత్స చర్చలు

అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల విధానాన్ని ప్రభుత్వం సమూలంగా మార్చింది. పరీక్ష ప్రశ్న పత్రాల నుంచి నిర్వహణ వరకు సంస్కరణలు అమలు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉపాధ్యాయ సంఘాల నేతలతో విజయవాడలో నిర్వహించిన చర్చల్లో సర్కారు నిర్ణయాలను వెల్లడించారు. 2022-23 విద్యా సంవత్సరంలో ఆరు పేపర్ల విధానంలో పదో తరగతి పరీక్షలు సాగాయి. సైన్స్‌లో భౌతిక, పర్యావరణ శాస్త్రాలకు సంబంధించిన పరీక్షను ఒకే రోజు నిర్వహించారు. ప్రశ్న పత్రాలు వేర్వేరుగా ఇచ్చి సమాధానాలు రాయించారు. అయితే, విద్యార్థులు కొందరు ఈ విధానంలో గందరగోళానికి గురయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి మళ్లీ 7 పేపర్ల విధానం అమలుచేయాలని సర్కారు నిర్ణయించింది. అంటే సైన్స్‌ పరీక్షలు 2 రోజులు నిర్వహిస్తారు. ఒక్కొక్క పేపర్‌ 50 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం 2 గంటలు. రెండు పేపర్లకు కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులవుతారు. అలాగే, తెలుగులో కాంపోజిట్‌ పేపర్‌ విధానాన్ని సర్కారు రద్దుచేసింది. ప్రస్తుతం ఈ విధానం ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువగా ఉంది. ఇందులో 30 మార్కులకు సంస్కృతం ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. కాగా, అందరికీ ఒకే విధానం ఉండాలనే ఉద్దేశంతో కాంపోజిట్‌ విధానాన్ని పూర్తిగా తొలగించినట్టు మంత్రి చెప్పారు. బదిలీ అయిన టీచర్లకు వారం రోజుల్లో జీతాలు ఇస్తామని మంత్రి బొత్స మీడియాకు తెలిపారు. టెన్త్‌ పరీక్షల్లో సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు.

మిగులే ఎక్కువ

ఈ ఏడాది జూలై 31 నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా మరోసారి టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. తాజా అంచనాల ప్రకారం జడ్పీ పాఠశాలల్లో 5,743 మంది ఉపాధ్యాయుల అవసరం ఉంటే, 4,306 మంది అదనంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 676 మంది ఉపాధ్యాయుల అవసరం కాగా, 356 మంది అదనంగా ఉన్నారు. ఎస్జీటీలు 4,102 మంది అవసరమైతే 9,199 మంది అదనంగా ఉన్నారు. మున్సిపల్‌ పాఠశాలల్లో 1,785 మంది అవసరమైతే, 876 మంది అదనంగా ఉన్నారని గుర్తించారు.

వేర్వేరు విధులు వద్దు: సంఘాలు

ఎంఈవో-1, ఎంఈవో-2లకు వేర్వేరుగా విధులు అప్పగిస్తామని మంత్రి బొత్స ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనను సంఘాలు వ్యతిరేకించాయి. మండలంలోని పాఠశాలలను చెరో సగం కేటాయించి, అన్ని బాధ్యతలూ ఇవ్వాలని సంఘాల నేతలు సూచించారు. ఈ సమావేశంలో ఎస్టీయూ నుంచి ఎల్‌.సాయి శ్రీనివాస్‌, హెచ్‌. తిమ్మన్న, ఏపీటీఎఫ్‌-257 నుంచి సీహెచ్‌. మంజుల, కె.భానుమూర్తి, ఏపీటీఎఫ్‌-1938 నుంచి జి. హృదయరాజు, ఎస్‌. చిరంజీవి, యూటీఎఫ్‌ నుంచి ప్రసాద్‌, నవ్యాంధ్ర టీచర్ల సంఘం నుంచి మాగంటి శ్రీనివాసరావు, మున్సిపల్‌ టీచర్ల సమాఖ్య నుంచి రామకృష్ణ, ఇతర సంఘాల నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-09T13:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising