ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC: అయోమయంలో అభ్యర్థులు! నిరాశతో నగరాన్ని వీడుతున్న నిరుద్యోగులు!

ABN, First Publish Date - 2023-04-03T12:58:44+05:30

అది చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీ! నెల క్రితం నిరుద్యోగ అభ్యర్థులతో నిండిపోయేది. కూర్చుందామంటే అక్కడ ఒక్క కుర్చీ దొరికేది కాదు. వరండా, హాళ్లు అన్నీ అభ్యర్థులతో

TSPSC
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సన్నద్ధతపై సందిగ్ధం!

‘రద్దు’తో అభ్యర్థుల్లో నిరాశ

నగరాన్ని వీడుతున్న వైనం

ఉగాదికి ఇంటికి వెళ్లి అక్కడే

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): అది చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీ! నెల క్రితం నిరుద్యోగ అభ్యర్థులతో నిండిపోయేది. కూర్చుందామంటే అక్కడ ఒక్క కుర్చీ దొరికేది కాదు. వరండా, హాళ్లు అన్నీ అభ్యర్థులతో కిటకిటలాడేవి. ఆరుబయట చెట్ల కింద కూడా స్టడీచైర్లు వేసుకొని ఎంతోమంది శ్రద్ధగా చదువుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అక్కడ అభ్యర్థులు పెద్దగా లేరు. తమ ఇంటి నుంచి తెచ్చుకున్న స్టడీచైర్లను చెట్లకు బిగించేసి తాళాలు వేసేశారు. ఏ చెట్టుకు చూసిన పదుల సంఖ్యలో స్టడీ చైర్లు కట్టిపడేసి ఉన్నాయి. చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీలోనే కాదు.. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌లోనూ స్టడీచైర్లకు తాళాలు వేసి ఉన్నాయి. ఓయూ (OU) లైబ్రరీలోనూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు తగ్గారు. నగరంలో వందల్లో నిర్వహిస్తున్న ప్రైవేటు స్టడీ హాల్స్‌లో కూడా అభ్యర్థులు తగ్గుముఖం పట్టారు. పలు ప్రైవేటు హాస్టల్స్‌ కూడా ఖాళీ అవుతున్నాయి. టీఎ్‌సపీఎస్సీ పేపర్‌ లీకైన తర్వాత అప్పటిదాకా కొలువు కొడతామని ఆశించిన అభ్యర్థుల్లో నిరాశా నిస్పృహలు ఆవహించాయి.

తెలంగాణ (Telangana) ఏర్పడ్డాక వివిధ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నవారికి సరైన సమయంలో నోటిఫికేషన్లు రాలేదు. రోజు రోజుకు వయసు పైబడటం, జీవితంలో స్థిరపడలేదనే ఆలోచన, ప్రైవేటు ఉద్యోగాలు, ఇంటి వద్ద ఉంటూనే కన్నవారికి వ్యవసాయ పనుల్లో చేదోడు, వాదోడుగా మెలిగే వారిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రకటన కొత్త ఆశలు చిగురింపచేసింది. మునుపెన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో గ్రూప్స్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటించడంతో నిరుద్యోగులు ఖుష్‌అయ్యారు. పైగా పొడిగించిన వయోపరిమితి కూడా అభ్యర్థుల్లో ఉత్సాహం నింపింది. గ్రూప్‌-1లో 503, గ్రూప్‌-2లో 782, గ్రూప్‌-3లో 1375, గ్రూప్‌-4లో 8,039 పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చాయి. వివిధ శాఖల్లోనూ ఖాళీలను ప్రకటించారు. కొలువుల పండుగ రావడంతో పెళ్లిళ్లు వాయిదా వేసుకొని కూడా ఎంతోమంది యువతీయుకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. కొందరైతే ప్రైవేటు ఉద్యోగాలు మానుకొని పరీక్షలకు సిద్ధమైపోయారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో కొందరైతే గ్రూప్‌-1, గ్రూప్‌-2 రాసేందుకు ఏడాదిగా సెలవులు పెట్టి సిద్ధమయ్యారు.

పేపర్‌ లీక్‌తో నిరుద్యోగుల్లో కలవరపాటు

టీఎస్‌పీఎఎస్సీ (TSPSC) లో పేపర్‌ లీక్‌ కావడం నిరుద్యోగ అభ్యర్థులను కలవరపాటుకు గురిచేసింది. లీకైంది ఏఈ పేపర్‌ ఒక్కటే కదా.? అని తొలుత భావించిన అభ్యర్థులు ఆ తర్వాత వరుసగా గ్రూప్‌-1 వరకు పలు పోటీ పరీక్షల తాలూకు పేపర్లు లీకైనట్లు, ఆయా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన వెలువడంతో నిరాశపడ్డారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పడినప్పటి నుంచి నిర్వహించిన పలు పోటీ పరీక్షల్లో పేపర్లు లీకైనట్లుగా వస్తున్న వదంతులు కొన్నేళ్లుగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ఉగాదికి ఇంటికెళ్ళి ఇంకా రాలేదు

గ్రూప్‌-1, గ్రూప్‌-2 తదితర పోటీ పరీక్షలకు చాలా మంది కొన్నేళ్లుగా ప్రిపేరవుతున్నారు. ఉద్యోగం సాధించాలనే తపనతో కొన్ని నెలలుగా ఇళ్లకు వెళ్లకుండా హాస్టల్‌, లైబ్రరీ, స్టడీ హాల్‌ తప్ప మరో ద్యాస లేకుండా సన్నద్ధమయ్యారు. కొందరైతే దగ్గరి బంధువుల పెళ్లిళ్లు, చావులకు కూడా వెళ్లకుండా ఏడాదిగా ప్రిపరేషన్‌ అనే కఠోర దీక్షతో గడిపారు. వారిలో ఇప్పుడు చాలామంది పేపర్‌ లీకేజీ, ఆ తర్వాత పరిణామాలతో ప్రిపేరేషన్‌కే స్వస్తి పలికారు. సీరియ్‌సగా ప్రిపేర్‌ అవుతున్న వారిలో కొందరు ఉగాది పండుగకు ముందే ఇళ్లకు వెళ్లిపోగా ఇంకొందరు ఉగాది పండుగకు ఇంటికెళ్ళి ఇంకా రాలేదు. కొందరైతే హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లగా, మరికొందరు స్నేహితుల రూమ్‌లో బుక్స్‌, బ్యాగులు సర్దిపెట్టేసి వెళ్లిపోయారు. గ్రూప్స్‌ ప్రిపేరైన అభ్యర్థుల్లో అత్యధికం పేద, మధ్య తరగతి అభ్యర్థులు కావడంతో వారంతా పరీక్షల రద్దు కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంకెన్నాళ్లు ఎగ్జామ్‌లు రాస్తావు? ఏదో పని చేసుకుందువుగానీ పెళ్లి చేసుకో అంటూ కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇన్నేళ్లు అప్పులు చేసి మరీ కోచింగ్‌కు అని, హాస్టల్‌ ఫీజు అని వేలకు వేలు పంపించాం. ఇంకా తమ వల్ల కాదు అంటూ తల్లిదండ్రుల్లో కొందరు చేతులెత్తేశారు.

బోసిపోతున్న లైబ్రరీలు, స్టడీ హాల్స్‌

రెండేళ్లుగా నిరుద్యోగ అభ్యర్థులు బారులు తీరడంతో నగరలోని అశోక్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, చిక్కడపల్లి, గాంధీనగర్‌, విద్యానగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి ప్రాంతాల్లోని ప్రైవేటు హాస్టళ్లు, స్టడీ హాల్స్‌ కిటకిటలాడాయి. నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టారీతిన ఫీజులను పెంచి అభ్యర్థులను దోచుకున్నాయి. ఆరు నెలల క్రితం వరకు స్టడీ హాల్స్‌ నెల అద్దె రూ.1200-రూ.1500 వరకు ఉండగా, ఒకదశలో అది రూ.2వేల నుంచి రూ.2500కు పెరిగింది. ప్రైవేటు హాస్టల్స్‌ నెల అద్దెను రూ.4వేల నుంచి రూ.6వేలకు పెంచేశాయి. పేపర్‌ లీకేజీ, పరీక్షల రద్దు కారణంగా హాస్టళ్లు, స్టడీ హాళ్లకు వేలకు వేలు ఫీజు కట్టిన వారంతా ఇక ఫీజులు కట్టలేం అంటూ వెనుదిరుగుతున్నారు. ఫలితంగా హాస్టళ్లు, స్టడీ హాళ్లు ఖాగా కనిపిస్తున్నాయి.

విధుల్లో చేరాలా? సన్నద్ధమవ్వాలా.?

నేను ప్రభుత్వ ఉద్యోగిని. గ్రూప్‌-1 జాబ్‌ సంపాదించాలనే పట్టుదలతో చేస్తున్న ఉద్యోగానికి ఆరు నెలలు సెలవు పెట్టాను. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ క్వాలిపై అయిన తర్వాత సొంత నాన్నమ్మ చనిపోతే వెళ్ళి చూసి వెంటనే సిటీకి వచ్చాను. మెయిన్స్‌ కోసం ప్రిపేరవుతున్నాను.. తీసుకున్న ఆరు నెలలు పూర్తవ్వడంతో సెలవులు పొడిగించాలని ఇటీవల దరఖాస్తు చేశాను. ఇంతలోనే పేపర్‌ లీక్‌ కారణంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. ఇప్పుడు నాకు.. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు సిద్ధమవ్వాలా? అర్ధం కావడం లేదు.

- వరంగల్‌కు చెందిన గ్రూప్‌-1 అభ్యర్థి

Updated Date - 2023-04-03T12:58:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising