ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Education: అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలు.. ఏఏ కోర్సుల్లో అంటే..!

ABN, First Publish Date - 2023-06-24T12:59:41+05:30

హైదరాబాద్‌లోని డా. బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయూ)- గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పలు స్టడీసెంటర్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని డా. బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయూ)- గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పలు స్టడీసెంటర్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు.

డిగ్రీ ప్రోగ్రామ్‌లు

కోర్సు వ్యవధి మూడేళ్లు. బీఏ, బీకాం, బీఎస్సీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. బీఏ, బీకాం కోర్సులకు ఏదేని గ్రూపుతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్సీలో ప్రవేశానికి ఇంటర్‌(సైన్స్‌) గ్రూపు అభ్యర్థులు అర్హులు. ఏపీ/తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ లేదా నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ నుంచి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి తరవాత రెండేళ్ల ఐటీఐ/ఒకేషనల్‌ కోర్సులు చేసినవారు కూడా అర్హులే. అభ్యర్థులు ఇంగ్లీష్‌ లేదా తెలుగు మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. బీఏ(పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, హిస్టరీ), బీఎస్సీ(బోటనీ, కెమిస్ట్రీ, జువాలజీ) కోర్సులు ఉర్దూ మీడియంలో కూడా అందుబాటులో ఉన్నాయి.

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌(బీఎల్‌ఐఎస్సీ) కోర్సు వ్యవధి ఏడాది. దీనిని తెలుగు/ఇంగ్లీష్‌ మాధ్యమంలో చదువుకునే వీలుంది. ద్వితీయ శ్రేణి మార్కులతో డిగ్రీ పూర్తిచేసినవారు; ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు రికార్డు అసిస్టెంట్‌గా ఏడాది అనుభవం లేదా డిప్లొమా/సర్టిఫికెట్‌ కోర్సు(లైబ్రరీ సైన్స్‌) పూర్తిచేసినవారు అర్హులు.

పీజీ ప్రోగ్రామ్‌లు

కోర్సు వ్యవధి రెండేళ్లు. ఎంబీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఏ(జర్నలిజం) ప్రోగ్రామ్‌లను ఆంగ్ల మాధ్యమంలో; లాంగ్వేజ్‌ ప్రోగ్రామ్‌లు మినహా అన్నింటినీ తెలుగు మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది.

ఎంఏ స్పెషలైజేషన్‌లు: జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, ఉర్దూ.

ఎమ్మెస్సీ స్పెషలైజేషన్‌లు: మేథమెటిక్స్‌, అప్లయిడ్‌ మేథమెటిక్స్‌, సైకాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఫిజిక్స్‌, జువాలజీ.

ఎంబీఏ స్పెషలైజేషన్‌లు: ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఆపరేషనల్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏ ప్రోగ్రామ్‌నకు టీఎ్‌స/ఏపీ ఐసెట్‌ 2023 అర్హత లేదా బీఆర్‌ఏఓయూ నిర్వహించే ఎంబీఏ ఈటీ 2023 అర్హత పొంది ఉండాలి. లాంగ్వేజె్‌సలో ఎంఏ కోర్సుకు డిగ్రీలో సంబంధిత లాంగ్వేజ్‌ని సెకండ్‌ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. ఎంకాం కోర్సుకు బీబీఏ/బీబీఎం/బీఏ(కామర్స్‌) అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెస్సీ (మేథమెటిక్స్‌/ అప్లయిడ్‌ మేథమెటిక్స్‌) కోర్సుకు బీఈ/బీటెక్‌ అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. ఎమ్మెస్సీ సైకాలజీకి ఏదేని డిగ్రీ పాసైతే చాలు.

  • మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (ఎంఎల్‌ఐఎస్సీ) కోర్సు వ్యవధి ఏడాది. ఇంగ్లీష్‌ మాధ్యమంలో మాత్రమే ఈ కోర్సు ఉంది. కనీసం 40 శాతం మార్కులతో బీఎల్‌ఐఎస్సీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్లొమా ప్రోగ్రామ్‌లు

కోర్సు వ్యవధి ఏడాది. స్పెషలైజేషన్‌కు నిర్దేశించిన విధంగా సంబంధిత/ ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్పెషలైజేషన్‌లు: సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మే నేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు, హ్యూమన్‌ రైట్స్‌, కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ టూరిజం, ఉమన్‌ స్టడీస్‌.

  • రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు విభాగానికి మాత్రం ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు మాస్‌ మీడియాలో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు

కోర్సు వ్యవధి ఆర్నెల్లు. విభాగాన్ని అనుసరించి పదోతరగతి/ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు.

విభాగాలు: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవల్‌పమెంట్‌, ఎన్‌జీఓస్‌ మేనేజ్‌మెంట్‌, ఎర్లీ ఛైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: www.braou.ac.in

Updated Date - 2023-06-24T13:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising