ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Notification: గుంటూరు ఎన్‌జీ రంగా వర్సిటీలో ప్రవేశాలు

ABN, First Publish Date - 2023-06-10T13:06:00+05:30

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ- డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అగ్రికల్చర్‌, సీడ్‌ టెక్నాలజీ, ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ విభాగాల్లో

Notification
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ- డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అగ్రికల్చర్‌, సీడ్‌ టెక్నాలజీ, ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ విభాగాల్లో ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ వ్యవధి మూడేళ్లు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లతోపాటు అనుబంధ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది.

డిప్లొమాలు-సీట్లు

  • డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌-ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 578 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 2060 సీట్లు ఉన్నాయి.

  • డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీ-ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 25 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 340 సీట్లు ఉన్నాయి.

  • డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌-ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 25 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 40 సీట్లు ఉన్నాయి.

  • డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌- ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 60 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 330 సీట్లు ఉన్నాయి.

  • కనీసం నాలుగేళ్లు గ్రామీణ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 75 శాతం సీట్లు, పట్టణ ప్రాంతాల్లో చదివినవారి కోసం 25 శాతం సీట్లు ప్రత్యేకించారు.

అర్హత వివరాలు: ఆంధ్రప్రదేశ్‌/తెలంగాణ స్టేట్‌ బోర్డు లేదా సీబీఎ్‌సఈ/ఐసీఎ్‌సఈ/ఎన్‌ఐఓఎ్‌స/ఏపీఓఎ్‌సఎ్‌స/టీఓఎ్‌సఎస్‌ నుంచి పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదోతరగతి కంపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులు; ఇంటర్‌ ఫెయిల్‌/మధ్యలో ఆపేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ ఉత్తీర్ణులు/ ఆపై చదివినవారు దరఖాస్తుకు అనర్హులు. అభ్యర్థుల వయసు ఆగస్టు 31 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.800; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 14 నుంచి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30

ఫస్ట్‌ ఫేజ్‌ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌: జూలై 17

సెకండ్‌ ఫేజ్‌ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌: జూలై 27

వెబ్‌సైట్‌: angrau.ac.in

Updated Date - 2023-06-10T13:06:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising