Telangana ITI కోర్సుల్లో ప్రవేశాలు.. వెబ్ ఆప్షన్స్ మాత్రం..!
ABN, First Publish Date - 2023-05-20T17:12:32+05:30
ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 10 లోపు ఆన్‌లైన్ దరఖాస్తుతోపాటు వెబ్ ఆప్షన్స్
హైదరాబాద్‌లోని కమిషనర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రెయినింగ్- ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ఐటీఐ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఐటీఐ సంస్థలలో; ఆర్‌ఐటీఐలలో అడ్మిషన్స్ ఇస్తారు. ఎన్‌సీవీటీ విధానంలో కోర్సులు ఆగస్టులో ప్రారంభమవుతాయి. ట్రేడ్‌ను అనుసరించి కోర్సు వ్యవధి ఏడాది/ రెండేళ్లు. అభ్యర్థులు తాము ఎంచుకొన్న ఐటీఐ సంస్థలు, ట్రేడ్‌ల ప్రాధాన్యక్రమాన్ని దరఖాస్తులో సూచించాలి. అకడమిక్ ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్రాప్ట్స్‌మెన్ ట్రెయినింగ్ స్కీం కింద శిక్షణ ఇస్తారు. కోర్సులో భాగంగా ప్రాక్టికల్ ట్రెయినింగ్, థియరిటికల్ ట్రెయినింగ్, ట్రేడ్ థియరీ, వర్క్‌షాప్ క్యాలిక్యులేషన్‌్క్ష సైన్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటాయి. ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ నేర్పిస్తారు. లైబ్రరీ సౌకర్యం ఉంది. ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 10 లోపు ఆన్‌లైన్ దరఖాస్తుతోపాటు వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేయాలి.
అర్హత: ట్రేడ్‌ను అనుసరించి ఎనిమిదోతరగతి/ పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 2023 ఆగస్టు 1 నాటికి అభ్యర్థి వయసు 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.
ట్రేడ్‌లు: కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డెంటల్ లేబరేటరీ ఎక్వి్‌పమెంట్ టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్(సివిల్, మెకానికల్), డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రీషియన్, ఎలకా్ట్రనిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఫౌండరీమన్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్(కెమికల్ ప్లాంట్) , ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, లేబరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్), లిథో ఆఫ్‌సెట్ మెకానిక్ మైండర్, మెషిని్‌స్ట(గ్రిండర్), మెషినిస్ట్, మెకానిక్ (మోటార్ వెహికిల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఆటోబాడీ పెయింటింగ్ 20, ఆటోబాడీ రిపేర్, డీజిల్), ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, ప్లంబర్, స్యూయింగ్ టెక్నాలజీ, షీట్ మెటల్ వర్కర్, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్(ఇంగ్లీష్), టర్నర్, వెల్డర్, వైర్‌మన్.
వెబ్‌సైట్: https://iti.telangana.gov.in
Updated Date - 2023-05-20T17:12:32+05:30 IST