ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dhirubhai Ambani ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ, పీహెచ్‌డీ

ABN, First Publish Date - 2023-04-18T18:01:08+05:30

గుజరాత్‌ (Gujarat)లోని ధీరూభాయ్‌ అంబానీ (Dhirubhai Ambani) ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(డీఏ - ఐఐసీటీ)- పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములలో

పీజీ, పీహెచ్‌డీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాత్‌ (Gujarat)లోని ధీరూభాయ్‌ అంబానీ (Dhirubhai Ambani) ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(డీఏ - ఐఐసీటీ)- పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ని అనుసరించి విడివిడిగా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ఎంటెక్‌(ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ): ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. మొత్తం సీట్లు 74. గేట్‌ కేటగిరీలో స్పెషలైజేషన్‌ల వారీగా మెషిన్‌ లెర్నింగ్‌ 24, సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌ 20, వీఎల్‌ఎ్‌సఐ అండ్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ 12 చొప్పున మొత్తం 56 సీట్లు ఉన్నాయి. నాన్‌ గేట్‌ కేటగిరీలో మెషిన్‌ లెర్నింగ్‌ 8, సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌ 6, వీఎల్‌ఎ్‌సఐ అండ్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ 4 చొప్పున మొత్తం 18 సీట్లు ఉన్నాయి.

అర్హత: గేట్‌ కేటగిరీ ద్వారా ప్రవేశం పొందాలంటే కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌(సీఎస్‌/ ఐటీ/ఎలక్ట్రికల్‌/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌) ఉత్తీర్ణులై ఉండాలి. మూడేళ్ల ఎంసీఏ ఉత్తీర్ణులు, ఎమ్మెస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలకా్ట్రనిక్స్‌/ మేథమెటిక్స్‌/ ఫిజిక్స్‌/ స్టాటిస్టిక్స్‌) పూర్తిచేసినవారు, డీఏ - ఐఐసీటీ నుంచి ఎంఎస్‌/ ఎమ్మెస్సీ చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరందరికీ గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి. నాన్‌ గేట్‌ కేటగిరీ ద్వారా ప్రవేశానికి కనీసం 65 శాతం మార్కులతో ఎమ్మెస్సీ(సీఎ్‌స/ఎలకా్ట్రనిక్స్‌)/ ఎంసీఏ/ బీఈ(సీఎస్‌/ ఐటీ/సీఎ్‌సఈ/ఈసీఈ/ఈఈ/ఈఎల్‌) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంటెక్‌(ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌): రెండేళ్ల వ్యవధిగల ఈ ప్రోగ్రామ్‌కు హైదరాబాద్‌లోని సీఆర్‌ రావు అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌(ఏఐఎంఎ్‌ససీఎస్‌) సహకారం అందిస్తోంది. అభ్యర్థులు ఆసక్తి మేరకు మూడు, నాలుగు సెమిస్టర్లను డీఏ-ఐఐసీటీ లేదా సీఆర్‌ రావు ఏఐఎంఎ్‌ససీఎస్‌ సంస్థలో చదువుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌ ప్రధాన స్పెషలైజేషన్‌ ‘వైర్‌లెస్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌’. గేట్‌ కేటగిరీలో 12, నాన్‌ గేట్‌ కేటగిరీలో 4 చొప్పున మొత్తం 16 సీట్లు ఉన్నాయి.

అర్హత: గేట్‌ కేటగిరీ ద్వారా ప్రవేశం పొందాలంటే కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ (సీఎస్‌/ ఐటీ/ఎలక్ట్రికల్‌/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌)/ మూడేళ్ల ఎంసీఏ/ఎమ్మెస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలకా్ట్రనిక్స్‌/ మేథమెటిక్స్‌/ ఫిజిక్స్‌/ స్టాటిస్టిక్స్‌)/ డీఏ - ఐఐసీటీ నుంచి ఎంఎస్‌/ ఎమ్మెస్సీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి గేట్‌ స్కోరు తప్పనిసరి. నాన్‌ గేట్‌ కేటగిరీలో ప్రవేశానికి 65 శాతం మార్కులతో ఎమ్మెస్సీ (ఎలకా్ట్రనిక్స్‌)/ బీఈ(ఇసీఈ) ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.

ఎమ్మెస్సీ: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లో 120 సీట్లు, డేటా సైన్స్‌లో 60 సీట్లు, అగ్రికల్చర్‌ అనలిటిక్స్‌లో 30 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి మూడు సెమిస్టర్లలో కోర్సు వర్కులు, చివరి సెమిస్టర్‌లో ప్రాజెక్టు వర్క్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది.

అర్హత: ఐటీ విభాగానికి ప్రథమ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. డేటా సైన్స్‌ విభాగానికి బీసీఏ/ బీఈ(సీఎస్‌/ ఐటీ/ఎలకా్ట్రనిక్స్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌)/ బీఎస్సీ(ఐటీ/ స్టాటిస్టిక్స్‌/మేథమెటిక్స్‌/ ఫిజిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ డేటా సైన్స్‌/ఎకనామిక్స్‌/ఎకనామెట్రిక్స్‌ అండ్‌ ఆపరేషనల్‌ రీసెర్చ్‌/ఏఐ/ఎంఎల్‌) ఉత్తీర్ణులై ఉండాలి. అగ్రికల్చర్‌ అనలిటిక్స్‌ విభాగానికి ప్రథమ శ్రేణి మార్కులతో డిగ్రీ(అగ్రికల్చర్‌-అలైడ్‌ సైన్సెస్‌/ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/ స్టాటిస్టిక్స్‌/ మేథమెటిక్స్‌/ ఫిజిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ ఐటీ)/ బీఈ(కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు కూడా అర్హులే. వీరు అక్టోబరు 30 నాటికి మార్కుల పత్రాలు సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్‌ అనలిటిక్స్‌ అభ్యర్థులకు దరఖాస్తునాటికి 45 ఏళ్ల వయసు మించకూడదు. మిగిలిన విభాగాలకు వయోపరిమితి నిబంధనలు లేవు.

ఎం డిజైన్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉన్నాయి. వీటిలో గ్రాఫిక్‌ డిజైన్‌, ఇంటర్ఫేస్‌ డిజైన్‌, ఫిల్మ్‌ మేకింగ్‌, యానిమేషన్‌, ఫొటోగ్రఫీ, డిజైన్‌ రిసెర్చ్‌ తదితర అంశాలు బోధిస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో 20 సీట్లు ఉన్నాయి.

అర్హత: ఎన్‌ఐడీ, ఎన్‌ఐఎ్‌ఫటీ, సీఈపీటీ, సృష్టి స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ వంటి జాతీయ సంస్థల నుంచి ప్రొఫెషనల్‌ డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిజైన్‌/సైన్స్‌/ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ/హ్యుమానిటీ్‌స/సోషల్‌ సైన్సె్‌స/ఫైన్‌ ఆర్ట్స్‌/ అప్లయిడ్‌ ఆర్ట్స్‌/ పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. కోర్సు ఏదైనా కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి.

పీహెచ్‌డీ

స్పెషలైజేషన్‌లు: ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, మేథమెటికల్‌ అండ్‌ నేచురల్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌.

అర్హత: సంబంధిత విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ/ ఎంఫిల్‌ పూర్తిచేసి ఉండాలి. నెట్‌ జేఆర్‌ఎఫ్‌/ డీఎ్‌సటీ ఇన్‌స్పయిర్‌ అర్హత పొంది ఉండాలి.

డీఏ-ఐఐసీటీ ఫెలోషిప్‌: కాంప్రహెన్సివ్‌ ఎగ్జామ్‌ పూర్తయ్యేవరకు నెలకు రూ.28,000 చెల్లిస్తారు. తరవాత మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000; చివరి రెండేళ్లు నెలకు రూ.35,000 ఇస్తారు. ఎంఫిల్‌ పూర్తిచేసినవారికి, నెట్‌ జేఆర్‌ఎఫ్‌/ గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ 500 కన్నా ఎక్కువ ఉన్నవారికి కూడా కాంప్రహెన్సివ్‌ ఎగ్జామ్‌ పూర్తయ్యాక నెలకు రూ.35,000 ఇస్తారు.

టీసీఎస్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌: మొదటి రెండేళ్లు నెలకు రూ.41,000; తరవాత నెలకు రూ.45,000 చెల్లిస్తారు. కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.1,00,000 ఇస్తారు.

ఎంపిక

ఎంటెక్‌: గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ 425 లోపు ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. అంతకు మించి స్కోరు ఉన్నవారికి మెరిట్‌ ప్రకారం షార్ట్‌లిస్ట్‌ రూపొందిస్తారు. నాన్‌ గేట్‌ అభ్యర్థులకు అకడమిక్‌ ప్రతిభకు 40 శాతం, ఇంటర్వ్యూ స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ ఇస్తూ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ఎమ్మెస్సీ: దేశవ్యాప్తంగా నిర్వహించే కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు(గంటన్నర). ఐటీ విభాగానికి నిర్వహించే పరీక్షలో ఇంటర్‌ స్థాయిలో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మేథమెటిక్స్‌కు 30ు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌కు 20ు, సీ ప్రోగ్రామింగ్‌కు 30ు, ఇంగ్లీష్‌ కాంప్రహెన్షన్‌కు 20ు వెయిటేజీ ఇస్తారు. డేటా సైన్స్‌ విభాగానికి నిర్వహించే పరీక్షలో మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, బేసిక్‌ కంప్యూటర్‌ సైన్స్‌(ప్రోగ్రామింగ్‌), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అన్నింటికీ సమాన వెయిటేజీ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు. అగ్రికల్చర్‌ అనలిటిక్స్‌కు నిర్వహించే ఎగ్జామ్‌లో మేథమెటిక్స్‌, సైన్స్‌, లాజికల్‌ రీజనింగ్‌ అంశాలనుంచి ఒక్కోదానిలో 15 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ స్కోర్‌కు 50 శాతం, ఇంటర్వ్యూ స్కోర్‌కు 30 శాతం, అకడమిక్‌ ప్రతిభకు 20 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎండిజైన్‌: అభ్యర్థులను సీడ్‌ వ్యాలిడ్‌ స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సీడ్‌ స్కోరు లేనివారు సంస్థ నిర్వహించే డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు రాయాల్సి ఉంటుంది. డీఏటీ ఎగ్జామ్‌లో మూడు పార్టులు ఉంటాయి. ఒక్కోదానికి 20 మార్కులు కేటాయించారు. మొదటి పార్టులో డ్రాయింగ్‌ స్కిల్స్‌, విజువలైజేషన్‌ అంశాలపై టెస్టు ఉంటుంది. రెండోదానిలో డిజైన్‌ ఐడియమ్స్‌, విజువల్‌ ఆర్ట్స్‌, సోషల్‌ అండ్‌ కల్చరల్‌ అంశాలపై అవగాహనను పరీక్షిస్తారు. మూడో పార్టులో కమ్యూనికేషన్‌ డిజైన్‌ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. డీఏటీ స్కోరుకి 60 శాతం, ఇంటర్వ్యూకి 40 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పీహెచ్‌డీ: ఇందులో ప్రవేశానికి నిర్వహించే టెస్ట్‌, ఇంటర్వ్యూల వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 24

నాన్‌ గేట్‌ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు: జూన్‌ 14, 15

ఎంట్రెన్స్‌ టెస్ట్‌: జూన్‌ 18న

మొదటి మెరిట్‌ లిస్ట్‌ విడుదల: జూన్‌ 22, 27

ఎంట్రెన్స్‌ టెస్ట్‌లో అర్హత పొందినవారికి ఇంటర్వ్యూలు: జూన్‌ 26, 27, 28, 29 ఊ ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: జూలై 5

వెబ్‌సైట్‌: aiict.ac.in/admissions

Updated Date - 2023-04-18T18:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising