ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ జేఎన్‌టీయూ ఆన్‌లైన్‌ కోర్సులు ఇలా..!

ABN, First Publish Date - 2023-05-19T16:56:05+05:30

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్‌)కి చెందిన

Hyderabad JNTU
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్‌)కి చెందిన స్కూల్‌ ఆఫ్‌ కంటిన్యూయింగ్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌(ఎ్‌ససీడీఈ)-ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఒక్కో కోర్సు వ్యవధి ఆర్నెల్లు. ప్రతి కోర్సులో మూడు థియరీ సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో సబ్జెక్ట్‌కు రెండు నెలల సమయం, 24 తరగతులు, మూడు క్రెడిట్‌లు నిర్దేశించారు. సాయంత్ర ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఆన్‌లైన్‌ సెషన్స్‌ ఉంటాయి. కనీసం 75 శాతం అటెండెన్స్‌ తప్పనిసరి. అదనంగా ఒక నెల ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి ఆరు క్రెడిట్‌లు ఉంటాయి. కోర్సులో భాగంగా అసైన్‌మెంట్‌లు, ఎండ్‌ ఎగ్జామినేషన్‌ ఉంటాయి. అసైన్‌మెంట్‌లకు 40 శాతం, ఎండ్‌ ఎగ్జామినేషన్‌కు 60 శాతం వెయిటేజీ ఇస్తారు. ఫ్యాకల్టీ మెంబర్లు, ఉద్యోగస్తులు, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో అడ్మిషన్స్‌ ఇస్తారు. యూనివర్సిటీకి చెందిన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, అకడమిక్‌ స్టూడెంట్స్‌కు కోర్సు ఫీజులో 40 శాతం రాయితీ లభిస్తుంది.

క్లౌడ్‌ అండ్‌ డెవోప్స్‌: ఇందులో క్లౌడ్‌ టెక్నాలజీ ఏడబ్ల్యూఎస్‌ ్క్ష మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్‌, కంటిన్యుయస్‌ ఇంటిగ్రేషన్‌/ కంటిన్యుయస్‌ డిప్లాయ్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవిజనింగ్‌ సబ్జెక్టులు ఉంటాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/ యూజీ/ పీజీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

డేటా సైన్స్‌-పైథాన్‌ ప్రోగ్రామింగ్‌: ఇందులో పైథాన్‌ ప్రోగ్రామింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌-బిగ్‌ డేటా సబ్జెక్టులు ఉంటాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/ యూజీ/ పీజీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వీఎల్‌ఎస్‌ఐ ఫిజికల్‌ డిజైన్‌: ఇందులో ఫిజికల్‌ డిజైన్‌ ఆటొమేషన్‌, డిజైన్‌ ఫర్‌ టేస్టబిలిటీ, డివైస్‌ మోడలింగ్‌ సబ్జెక్టులు ఉంటాయి.

అర్హత: బీటెక్‌(ఈసీఈ/ఈఐఈ/ఈఈఈ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఎలకా్ట్రనిక్స్‌, కంప్యూటర్స్‌లో ప్రాథమిక పరిజ్ఞానం; ఏదైనా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో రైటింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

ముఖ్య సమాచారం

కోర్సు ఫీజు: రూ.25,000

అడ్మిషన్‌ ఫీజు: రూ.1000

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 26

వెబ్‌సైట్‌: www.jntuh.ac.in.

Updated Date - 2023-05-19T16:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising