ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Education: తెలంగాణ వ్యవసాయ వర్సిటీల్లో డిగ్రీ సెకండ్‌ కౌన్సెలింగ్‌

ABN, First Publish Date - 2023-10-05T15:41:47+05:30

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ(పీజేటీఎస్‌ఏయూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ(పీజేటీఎస్‌ఏయూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ(పీవీఎన్‌ఆర్‌టీవీయూ), సిద్దిపేట్‌-ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ(ఎ్‌సకేఎల్‌టీఎ్‌సహెచ్‌యూ) ఉమ్మడిగా వ్యవసాయ ఆధారిత డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి సెకండ్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. దీని ద్వారా బైపీసీ స్ట్రీం కింద బీఎస్సీ ఆనర్స్‌ అగ్రికల్చర్‌, బీవీఎస్సీ ్క్ష ఏహెచ్‌, బీఎ్‌ఫఎస్సీ, బీఎస్సీ ఆనర్స్‌ హార్టికల్చర్‌ ప్రోగ్రామ్‌లలో మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నారు. సీట్ల వివరాలను అక్టోబరు 6 నాటికి ప్రకటిస్తారు.

తెలంగాణ ఎంసెట్‌ 2023 ర్యాంక్‌ ఆధారంగా రాష్ట్రంలోని అగ్రికల్చర్‌, వెటర్నరీ, హార్టికల్చర్‌ కళాశాలల్లో సీట్లు అలాట్‌ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన అగ్రికల్చరల్‌ కాలేజ్‌-తోర్నాల(సిద్దిపేట్‌)లోని బీఎస్సీ ఆనర్స్‌ అగ్రికల్చర్‌ సీట్లను; కాలేజ్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌-మల్యాల్‌(మహబూబాబాద్‌)లోని బీఎస్సీ ఆనర్స్‌ హార్టికల్చర్‌ సీట్లను కూడా ఈ నోటిఫికేషన్‌ ద్వారానే భర్తీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

అర్హత

బైపీసీ స్ట్రీం కింద మొదటి ఫేజ్‌ కౌన్సెలింగ్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు సబ్మిట్‌ చేసి ఉండాలి.

మొదటి ఫేజ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనని అభ్యర్థులు, మొదటి ఫేజ్‌లో సీటు రానివారు, సీటు వచ్చినా కాలేజీ మారాలనుకునేవారు/కాలేజీలో రిపోర్ట్‌ చేయనివారు/అడ్మిషన్‌ క్యాన్సిల్‌ చేసుకున్నవారు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌: తెలంగాణ ఎంసెట్‌ 2023లో 352-6195 మధ్య ర్యాంక్‌లు వచ్చినవారు అక్టోబరు 9న; 6212-9188 మధ్య ర్యాంక్‌లు వచ్చినవారు అక్టోబరు 10న; 9215-13600 మధ్య ర్యాంక్‌లు వచ్చినవారు అక్టోబరు 11న; 13601-18994 మధ్య ర్యాంక్‌లు వచ్చినవారు అక్టోబరు 12న; 19012-25976 మధ్య ర్యాంక్‌లు వచ్చినవారు అక్టోబరు 13న ఉదయం తొమ్మిదిన్నరకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.

వేదిక: యూనివర్సిటీ ఆడిటోరియం, పీజేటీఎ్‌సఏయూ క్యాంపస్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌

వెబ్‌సైట్‌: www.pjtsau.edu.in

Updated Date - 2023-10-05T15:41:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising