ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Exam Special: స్వాతంత్రోద్యమ కాలంలో వికాస ప్రయోగాలు

ABN, First Publish Date - 2023-01-02T15:04:59+05:30

భారతదేశం (India)లో ప్రాచీన కాలం నుంచే స్థానిక ప్రభుత్వాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. రుగ్వేదంలో, కౌటిల్యుడి అర్థశాస్త్రంలో స్థానిక సంస్థల గురించి వివరంగా ఉంది. ఇక ఆధునిక భారతదేశ చరిత్ర (History of India)లో

పోటీ పరీక్షల ప్రత్యేకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండియన్‌ పాలిటీ

పోటీ పరీక్షల ప్రత్యేకం

భారతదేశం (India)లో ప్రాచీన కాలం నుంచే స్థానిక ప్రభుత్వాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. రుగ్వేదంలో, కౌటిల్యుడి అర్థశాస్త్రంలో స్థానిక సంస్థల గురించి వివరంగా ఉంది. ఇక ఆధునిక భారతదేశ చరిత్ర (History of India)లో 1687లో ‘మద్రాస్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటుతో స్థానిక పరిపాలన ప్రారంభమైంది.

స్థానిక ప్రభుత్వాలు

గుర్గావ్‌ ప్రయోగం(1920): గుర్గావ్‌ జిల్లా(పంజాబ్‌)లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన ఎఫ్‌.ఐ.బ్రేయన్‌ గ్రామీణ అభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తి పెంపు, ప్రజారోగ్యాన్ని పెంపొందించడం, అభివృద్ధి పథకాలను పునర్‌వ్యవస్థీకరించడం, ఉత్సవాలు, వివాహాల్లో జరిగే ధన వ్యయాన్ని తగ్గించి సమాజ అభివృద్ధికి తోడ్పడటం వంటివి ఈ ప్రయోగంలోని ముఖ్య లక్షణాలు.

మార్తాండం ప్రయోగం(1921): అమెరికన్‌ వ్యవసాయ(American agriculture) నిపుణులైన స్పెన్సర్‌, హబ్‌ దీని రూపకర్తలు. కన్యాకుమారి(తమిళనాడు) జిల్లాలోగల ‘మార్తాండం’ అనే ప్రాంతంలో వీరు 70 గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. వైఎంసీఏ(యంగ్‌ మెన్స్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌) సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలికాంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రజల్లో అభివృద్ధిపై చైతన్యం కలిగించడానికి ఈ ప్రయోగం చేశారు.

శ్రీనికేతన్‌ ప్రయోగం(1921): రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ (Rabindranath Tagore) దీని రూపకర్త. కలకత్తాలో 1921లో ప్రారంభించిన ‘ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి’ అనే అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో భాగంగా వ్యవసాయం, చేనేత పరిశ్రమలు, విద్యపై శిక్షణ ఇచ్చారు. చిన్న తరహా పరిశ్రమల నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానాన్ని నేర్పించారు. వయోజన విద్య, ఆరోగ్య సంరక్షణ మొదలైన వాటిపై ప్రత్యేక శిక్ష ణ ఇచ్చారు.

బరోడా ప్రయోగం(1932): బరోడా సంస్థానం దివాన్‌ వి.టి.కృష్ణమాచారి ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతను సమీకరించారు. వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

సేవాగ్రామ్‌ ప్రయోగం(1933): మహారాష్ట్రలోని వార్దాలో మహాత్మా గాంధీ (Mahatma Gandhi) ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. సర్వోదయ, నవోదయ సిద్ధాంతాలపై వినోభా భావే, జయప్రకాశ్‌ నారాయణ్‌(Jayaprakash Narayan) ఆకర్షితులై అనేక సమాజ వికాస కార్యక్రమాలను నిర్వహించారు.

ఫిర్కా ప్రయోగం(1946): 1946లో అప్పటి మద్రాస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు (Tanguturi Prakasam Pantulu) తాలూకాలను ఫిర్కాలుగా విభజించి వాటి అభివృద్ధి కోసం కొన్ని ప్రయోగాలు చేశారు. దీనినే ఫిర్కా ప్రయోగం అంటారు. 1952లో ప్రారంభించిన సమాజ అభివృద్ధి పథకంలో భాగంగా ప్రారంభించిన బ్లాక్‌లలో ఈ ఫిర్కాలను విలీనం చేశారు.

ఇటావా ప్రయోగం(1948): లోహ్‌తక్‌(ఉత్తరప్రదేశ్‌)లోని ఇటావా అనే ప్రాంతంలో అల్బర్ట్‌ మేయర్‌ అనే ఇంజనీర్‌ 97 గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజ అభివృద్ధికి సంబంధించిన అంశాలను, వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేనేత పరిశ్రమల ప్రోత్సాహానికి కృషి చేశారు.

నీలో ఖేరి ప్రయోగం(1948): ఎస్‌.కె.డే దీనిని ప్రారంభించారు. దేశ విభజన సమయంలో నిరాశ్రయులైన దాదాపు ఏడు వేల మందికి పునరావాసంలో భాగంగా హర్యానాలోని కర్నాల్‌ జిల్లాలో గల నీలోఖేరి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను అభివృద్ధి చేయడం కోసం 1952 అక్టోబరు 2న సమాజ అభివృద్ధి ప్రయోగం/సమాజ వికాస ప్రయోగం అనే పథకాన్ని ప్రారంభించారు.

స్వాతంత్ర్యానంతరం స్థానిక సంస్థల అభివృద్ధికి చేపట్టిన చర్యలు

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరవాత ‘ఆర్టికల్‌-40’లో స్థానిక ప్రభుత్వాల(గ్రామ పంచాయతీ) అభివృద్ధికి రాజ్యం కృషి చేయాలని పేర్కొన్నారు.

సమాజ అభివృద్ధి ప్రయోగం (CDP- Community Development Progra-mme): గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను అభివృద్ధి చేయడం కోసం 1952 అక్టోబరు 2న సమాజ అభివృద్ధి ప్రయోగం/సమాజ వికాస ప్రయోగం అనే పథకాన్ని ప్రారంభించారు. ప్రణాళికా సంఘం, కృష్ణమాచారి కమిటీ(గ్రోమోర్‌ ఫుడ్‌ ఎంక్వయిరీ కమిటీ) ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు. గ్రామీణ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఫోర్డ్‌ ఫౌండేషన్‌ సంస్థ తోడ్పాటును అందించింది. ఇటువంటి పథకాన్నే అమెరికాలోని ‘ఇటావా’ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉండేవారు. సీడీపీ పథకంలో భాగంగా ఒక్కో బ్లాక్‌లో 60,000 నుంచి 70,000 వరకు జనాభా ఉండే లాగా చూశారు. ఒక్కో బ్లాక్‌కి ఒక బ్లాక్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌(బీడీవో)ని నియమించారు. 55 బ్లాక్‌లలో ప్రారంభమైన ఈ పథకం 5011 బ్లాక్‌లకు విస్తరించింది.

జాతీయ విస్తరణ సేవా పథకం (NESS- National Extention Service Sc-heme): సీడీపీకి విస్తరణగా 1953 అక్టోబరు 2న జాతీయ విస్తరణ సేవా పథకం ప్రారంభించారు. 1957లో సీడీపీ, నెస్‌ పథకాల పనితీరును పరిశీలించడానికి భారత ప్రభుత్వం ‘బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీ’ని నియమించింది. ఈ కమిటీ సీడీపీ, నెస్‌ పథకాలు విఫలమయ్యాయని, వాటి స్థానంలో మూడు అంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.

-వి.చైతన్యదేవ్‌

పోటీ పరీక్షల నిపుణులు

Updated Date - 2023-01-02T15:25:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising