Notification: హైదరాబాద్ జేఎన్‌టీయూలో డబుల్ డిగ్రీ ప్రవేశాలు
ABN, First Publish Date - 2023-07-01T13:47:11+05:30
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్), స్వీడన్‌లోని బ్లీకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్) ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐడీడీఎంపీ)లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్), స్వీడన్‌లోని బ్లీకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్) ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐడీడీఎంపీ)లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రోగ్రామ్ వ్యవధి అయిదేళ్లు. మొదటి మూడున్నరేళ్లు జేఎన్‌టీయూహెచ్‌లో, చివరి ఏడాదిన్నర బీటీహెచ్‌లో చదవాల్సి ఉంటుంది. ఏడాదికి రెండు చొప్పున మొత్తం పది సెమిస్టర్లు ఉంటాయి. బీటెక్, ఎంటెక్ డిగ్రీలను జేఎన్‌టీయూహెచ్; ఎమ్మెస్సీ డిగ్రీని బీటీహెచ్ ప్రదానం చేస్తాయి. టీఎస్ ఎంసెట్ 2023 ర్యాంక్ ద్వారా 70 శాతం సీట్లను, ఐఐటీ జేఈఈ(మెయిన్) 2023 ర్యాంక్ ద్వారా 30 శాతం సీట్లను భర్తీ చేస్తారు. ఈ కోర్సుకు సంబంధించిన అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ను జూలై 13న సాయంత్రం నాలుగు గంటలకు ఆన్‌లైన్ ద్వారా జేఎన్‌టీయూహెచ్ నిర్వహిస్తుంది. స్వీడన్‌లో ఐడీడీఎంపీ ప్రోగ్రామ్ పూర్తిచేసిన అభ్యర్థులు అక్కడే మరో ఏడాది రెసిడెన్స్ పర్మిట్ పొందవచ్చు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి.
స్పెషలైజేషన్‌లు-సీట్లు
ఈసీఈలో 20 సీట్లు ఉన్నాయి. బీటెక్‌లో ఈసీఈ; ఎంటెక్, ఎమ్మెస్సీలలో మెషిన్ లెర్నింగ్-సెన్సర్స్ ్క్ష సిస్టమ్స్ చదవాల్సి ఉంటుంది.
సీఎ్‌సఈలో 60 సీట్లు ఉన్నాయి. బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఉంటుంది. ఎంటెక్, ఎమ్మెస్సీలలో సీఎస్‌ఈ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్‌లు ఎంచుకోవచ్చు. ఒక్కోదానిలో 20 సీట్లు ప్రత్యేకించారు.
అర్హత: బీఐఈ(టీఎ్‌స/ఏపీ)/సీబీఎ్‌సఈ/ఐసీఎ్‌సఈ నుంచి మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/పన్నెండోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. టీఎస్ ఎంసెట్ 2023 లేదా జేఈఈ(మెయిన్) 2023లో ర్యాంక్ సాధించి ఉండాలి. అడ్మిషన్స్ నాటికి అభ్యర్థుల వయసు పదహారేళ్లు నిండి ఉండాలి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.2000
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 12
అడ్మిషన్ కౌన్సెలింగ్: జూలై 17
కౌన్సెలింగ్ వేదిక: డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్‌టీయూహెచ్, కూకట్‌పల్లి, హైదరాబాద్
వెబ్‌సైట్: www.jntuh.ac.in
Updated Date - 2023-07-01T13:47:11+05:30 IST