ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Notification: ఎన్జీ రంగా వర్సిటీ అగ్రిసెట్‌ 2023 నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2023-07-22T17:23:33+05:30

గుంటూరు-లాంలోని ఆచార్య ఎన్‌.జీ.రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఏఎన్‌జీఆర్‌ఏయూ)-‘అగ్రిసెట్‌ 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని వ్యవసాయ విభాగాల్లో పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్దేశించారు.

గుంటూరు-లాంలోని ఆచార్య ఎన్‌.జీ.రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఏఎన్‌జీఆర్‌ఏయూ)-‘అగ్రిసెట్‌ 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని వ్యవసాయ విభాగాల్లో పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్దేశించారు. ఈ ఎగ్జామ్‌లో సాధించిన స్కోర్‌ ద్వారా నాలుగేళ్ల వ్యవధి గల ‘బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌’ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్స్‌ ఇస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌, అనుబంధ అగ్రికల్చరల్‌ కళాశాలల్లో నిర్దేశిత సీట్లు భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలు: అగ్రికల్చర్‌, సీడ్‌ టెక్నాలజీ, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌

సీట్ల వివరాలు: పాలిటెక్నిక్‌ వ్యవసాయ డిప్లొమా అభ్యర్థుల కోసం ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల్లో 162 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 48 సీట్లు చొప్పున మొత్తం 210 సీట్లు నిర్దేశించారు.

  • ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల్లో అగ్రికల్చర్‌ అభ్యర్థులకు 133 సీట్లు, సీడ్‌ టెక్నాలజీ అభ్యర్థులకు 23 సీట్లు, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ అభ్యర్థులకు 6 సీట్లు ఉన్నాయి.

  • అనుబంధ వ్యవసాయ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద అగ్రికల్చర్‌ అభ్యర్థులకు 39 సీట్లు, సీడ్‌ టెక్నాలజీ అభ్యర్థులకు 7 సీట్లు, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ అభ్యర్థులకు 2 సీట్లు ఉన్నాయి.

అర్హత: ఏఎన్‌జీఆర్‌ఏయూ/పీజేటీఎ్‌సఏయూ నుంచి రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా(అగ్రికల్చర్‌/సీడ్‌ టెక్నాలజీ/ఆర్గానిక్‌ ఫార్మింగ్‌) పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. జనరల్‌ అభ్యర్థులకు 22 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు; దివ్యాంగులకు 27 ఏళ్లు మించకూడదు.

అగ్రిసెట్‌ 2023 వివరాలు: అభ్యర్థులు తమ డిప్లొమా స్ట్రీమ్‌లోనే అగ్రిసెట్‌ ఎగ్జామ్‌ రాయాలి. ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌. ఇందులో మొత్తం 120 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. డిప్లొమా(అగ్రికల్చర్‌/సీడ్‌ టెక్నాలజీ/ఆర్గానిక్‌ ఫార్మింగ్‌) ప్రోగ్రామ్‌లకు ఏఎన్‌జీఆర్‌ఏయూ నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. నెగెటివ్‌ మార్కులు లేవు. పరీక్ష సమయం గంటన్నర. ఈ ఎగ్జామ్‌లో అర్హత సాధించాలంటే జనరల్‌ అభ్యర్థులకు కనీసం 25 శాతం(30)మార్కులు రావాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1400; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.700

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 5

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఎడిట్‌ విండో ఓపెన్‌: ఆగస్టు 11న

దరఖాస్తు హార్డ్‌ కాపీ చేరేందుకు చివరి తేదీ: ఆగస్టు 16

హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడింగ్‌: ఆగస్టు 20 నుంచి 25 వరకు

అగ్రిసెట్‌ మాక్‌ టెస్ట్‌ తేదీలు: ఆగస్టు 25 నుంచి 30 వరకు

ఏఎన్‌జీఆర్‌ఏయూ అగ్రిసెట్‌ 2023 తేదీ: సెప్టెంబరు 1

వెబ్‌సైట్‌: angrau.ac.in

ఏ చిరునామా: కన్వీనర్‌-అగ్రిసెట్‌ 2023, అసోసియేట్‌ డీన్‌, అగ్రికల్చరల్‌ కాలేజ్‌, బాపట్ల - 522101

Updated Date - 2023-07-22T17:23:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising