హైదరాబాద్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ.. వారు మాత్రం ఎంట్రెన్స్ రాయనక్కర్లేదు..!
ABN, First Publish Date - 2023-05-08T13:09:12+05:30
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. జేఆర్‌ఎఫ్ అర్హత ఉన్న అభ్యర్థులు ఎంట్రెన్స్ రాయనవసరం లేదు.
మొత్తం 287 సీట్లు ఉన్నాయి.
స్పెషలైజేషన్‌లు-సీట్లు: మేథమెటిక్స్ 4, అప్లయిడ్ మేథమెటిక్స్ 1, కంప్యూటర్ సైన్స్ 15, ఫిజిక్స్ 20, ఎలకా్ట్రనిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 5, ఎర్త్-ఓషన్-అట్మాస్పిరిక్ సైన్సెస్ 9, కెమిస్ట్రీ 24, బయోకెమిస్ట్రీ 13, ప్లాంట్ సైన్సెస్ 9, యానిమల్ బయాలజీ 5, బయోటెక్నాలజీ 6, సిస్టమ్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ 2, ఇంగ్లీష్ 7, ఫిలాసఫీ 7, తెలుగు 12, హిందీ 12, ఉర్దూ 5, అప్లయిడ్ లింగ్విస్టిక్స్ 3, ట్రాన్స్‌లేషనల్ స్టడీస్ 1, కంపారటివ్ లిటరేచర్ 4, శాంస్ర్కిట్ స్టడీస్ 2, హిస్టరీ 9, పొలిటికల్ సైన్స్ 12, సోషియాలజీ 16, ఆంత్రోపాలజీ 3, ఎడ్యుకేషన్ 7, రీజనల్ స్టడీస్ 3, సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజివ్ పాలసీ 8, ఇండియన్ డయాస్పొరా 2, జెండర్ స్టడీస్ 2, ఎకనామిక్స్ 21, డ్యాన్స్ 2, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్ 1, కమ్యూనికేషన్ 4, మేనేజ్‌మెంట్ స్టడీస్ 15, పబ్లిక్ హెల్త్ 2, సైకాలజీ 1, కాగ్నిటివ్ సైన్స్ 5, మెటీరియల్స్ ఇంజనీరింగ్ 7, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ 1.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంఫిల్ (మేథమెటిక్స్/స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. స్పెషలైజేషన్‌కు నిర్దేశించిన ఇతర/తత్సమాన అర్హతల వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600; ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.550; ఓబీసీ అభ్యర్థులకు రూ.400; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.275
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 25
హాల్‌టికెట్స్ డౌన్‌లోడింగ్: జూన్ 10
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ
ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ తేదీలు: జూన్ 17, 18
ఇంటర్వ్యూలు: జూలై 15 నుంచి 19 వరకు
కౌన్సెలింగ్: ఆగస్టు 10, 11
తరగతులు ప్రారంభం: ఆగస్టు 14 నుంచి
వెబ్‌సైట్: www.uohyd.ac.in
Updated Date - 2023-05-08T13:09:12+05:30 IST