ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Notification: ఓయూ దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు.. ఆ స్కోరు ఆధారంగానే సీట్లు

ABN, First Publish Date - 2023-08-11T12:10:18+05:30

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్‌ జి.రామ్‌రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌...2023-24 విద్యా సంవత్సరానికి దూర విద్యా విధానంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్‌ జి.రామ్‌రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌...2023-24 విద్యా సంవత్సరానికి దూర విద్యా విధానంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష/టీఎస్‌ ఐసెట్‌-2023/ఏపీ ఐసెట్‌ 2023లో సాధించిన స్కోరు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

ప్రోగ్రామ్‌ వివరాలు:

ఎంబీఏ: కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి సెమిస్టర్‌లో ఆర్గనైజేషనల్‌ థియరీ అండ్‌ బిహేవియర్‌, మేనేజీరియల్‌ ఎకనామిక్స్‌, ఫైనాన్షియల్‌ అకౌంట్స్‌ అండ్‌ అనాలిసిస్‌, ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌, స్టాటిస్టిక్స్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌, ఇంట్రడక్షన్‌ టు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితర పాఠ్యాంశాలుంటాయి. రెండో సెమిస్టర్‌లో బిజినెస్‌ లాస్‌ అండ్‌ ఎథిక్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ పాలిసి, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెట్‌ రీసెర్చ్‌, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ ఫర్‌ డెసిషన్‌ మేకింగ్‌ వంటి వాటిని బోధిస్తారు. మూడో సెమిస్టర్‌ సిలబ్‌సలో మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, బిజినెస్‌ కమ్యూనికేషన్స్‌, మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ కంట్రోల్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలు ఉంటాయి. వీటితో పాటు మూడు ఎలక్టివ్‌లు(హెచ్‌ఆర్‌ఎం ఏరియా, మార్కెటింగ్‌ ఏరియా, ఫైనాన్షియల్‌ ఏరియా) ఉంటాయి. నాలుగో సెమిస్టర్‌లో టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు మూడు ఎలక్టివ్‌లు(హెచ్‌ఆర్‌ఎం ఏరియా, మార్కెటింగ్‌ ఏరియా, ఫైనాన్షియల్‌ ఏరియా) ఉంటాయి.

ఎంసీఏ: కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. రెండేళ్ల కోర్సు సిలబ్‌సలో మేథమెటికల్‌ ఫౌండేషన్స్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, డేటా స్ట్రక్చర్స్‌ యూజింగ్‌ సి, ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ యూజింగ్‌ జావా, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్‌, ప్రొబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌, మేనేజీరియల్‌ ఎకనామిక్స్‌ అండ్‌ అకౌంటెన్సీ, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, డిజైన్‌ అండ్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ ఆల్గారిథమ్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఆపరేషన్స్‌ రీసెర్చ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, డేటా సైన్స్‌, వెబ్‌ టెక్నాలజీ్‌సతోపాటు నాలుగు ప్రొఫెషనల్‌ ఎలక్టివ్‌లు ఉంటాయి.

అర్హత: ఎంబీఏ కోర్సుకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేట్‌; ఎంసీఏ కోర్సుకు కనీసం 50 శాతం మార్కులతో గణితం సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు ఉంటే చాలు.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. టీఎ్‌స/ఏపీ ఐసెట్‌-2023లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో నేరుగా ప్రవేశం పొందవచ్చు.

అర్హత పరీక్ష: ఈ పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష ఓఎంఆర్‌ షీట్‌ పద్ధతిలో ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. ప్రశ్న పత్రంలో మూడు విభాగాలుంటాయి. సెక్షన్‌- ఎ అనలిటికల్‌ ఎబిలిటీ(డేటా సఫిషియెన్సీ-10 ప్రశ్న లు, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌-25 ప్రశ్నలు); సెక్షన్‌-బి మేథమెటికల్‌ ఎబిలిటీ(అర్థమెటికల్‌ ఎబిలిటీ-20 ప్రశ్నలు, ఆల్జిబ్రియాకల్లీ అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ-15 ప్రశ్నలు, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ-5 ప్రశ్నలు); సెక్షన్‌-సి కమ్యూనికేషన్‌ ఎబిలిటీ(వొకాబులరీ-5 ప్రశ్నలు, బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టర్మినాలజీ-5 ప్రశ్నలు, ఫంక్షనల్‌ గ్రామర్‌-5 ప్రశ్నలు, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌-10 ప్రశ్నలు) ఉంటాయి.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.900

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15

రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 18

వెబ్‌సైట్‌: http://www.oucde.net/

Updated Date - 2023-08-11T12:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising