కర్నూలు ఐఐఐటీడీఎంలో పీహెచ్‌డీ
ABN, First Publish Date - 2023-09-29T13:57:35+05:30
ఏపీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (ఐఐఐటీడీఎం), కర్నూలు...విశ్వేశరాయ ఫెలోషిప్ స్కీమ్ కింద పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఏపీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (ఐఐఐటీడీఎం), కర్నూలు...విశ్వేశరాయ ఫెలోషిప్ స్కీమ్ కింద పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్‌డీ). ఫుల్‌టైం ప్రోగ్రామ్.
ఇంజనీరింగ్ విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్
సైన్స్ విభాగాలు: ఫిజిక్స్, మేథమెటిక్స్
అర్హతలు
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ఏఐ/ఐటీలో మాస్టర్స్ డిగ్రీతో పాటు గేట్ వ్యాలిడ్ స్కోరు ఉండాలి.
ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌తో మాస్టర్స్ డిగ్రీతో పాటు గేట్ వ్యాలిడ్ స్కోరు ఉండాలి.
మెకానికల్ ఇంజనీరింగ్: మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీతో పాటు గేట్ వ్యాలిడ్ స్కోరు ఉండాలి.
ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు మంచి అకడమిక్ స్కోరు ఉన్నట్లయితే వారిని ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో పీహెచ్‌డీకి పరిశీలిస్తారు. అయితే ఈ అభ్యర్థులు ఐఐటీ నుంచి కనీసం 8 సీజీపీఏతో బీటెక్ ఉత్తీర్ణత తోపాటు గేట్ వ్యాలిడ్ స్కోరు ఉండాలి. అదేవిధంగా ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో టాప్ టెన్ ర్యాంకుల్లో ఉన్నవారు, ప్రఖ్యాత ఆర్‌అండ్‌డీ ఆర్గనైజేషన్ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తుకు అర్హులే.
సైన్సెస్: ఫిజిక్స్‌లో ప్రవేశం పొందగోరే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/మెటీరియల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్/సీఎ్‌సఐఆర్-నెట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. మేథమెటిక్స్‌లో ప్రవేశం పొందగోరే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఇన్ మేథమెటిక్స్/అప్లయిడ్ మేథమెటిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్/సీఎ్‌సఐఆర్-నెట్/ఎన్‌బీహెచ్‌ఎం పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.
ఫైనాన్షియల్ అసిస్టెన్స్: ఎంపికైన అభ్యర్థులకు విశ్వేశరాయ ఫెలోషిప్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లభిస్తుంది. ఇందులో భాగంగా మొదటి రెండేళ్లు నెలకు రూ.38,750 చొప్పున, మూడో, నాలుగో సంవత్సరం నెలకు రూ.43,750 చొప్పున అందజేస్తారు.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తరవాత షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు రిటెన్ టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.
ముఖ్య సమాచారం
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 8
షార్ట్‌లిస్ట్ అభ్యర్థుల జాబితా ప్రకటన: అక్టోబరు 16
రిటెన్ టెస్ట్/ఇంటర్వ్యూ తాత్కాలిక తేదీలు: అక్టోబరు 27 నుంచి 31 వరకు
ఫలితాల ప్రకటన: నవంబరు 3
సీటు కన్ఫర్మేషన్ ఫీజు చెల్లింపు: నవంబరు 10
ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్టింగ్ తేదీ: నవంబరు 13
వెబ్‌సైట్: https://iiitk.ac.in/
Updated Date - 2023-09-29T13:57:35+05:30 IST