Jobs: ఏపీ పబ్లిక్ హెల్త్‌లో స్టాఫ్ నర్సు పోస్టులు.. ఖాళీలెన్నంటే..!
ABN, First Publish Date - 2023-09-27T12:44:25+05:30
విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(డీపీహెచ్&ఎ్‌ఫడబ్ల్యూ)-ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(డీపీహెచ్&ఎ్‌ఫడబ్ల్యూ)-ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 434 పోస్టులు ఉన్నాయి. ఒప్పంద వ్యవ ధి ఏడాది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను సంబంధిత జోన్‌లోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి.
అర్హత: అభ్యర్థులు జనరల్ నర్సింగ్&మిడ్ వైఫరీ/బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 జూలై 1 నాటికి 42 ఏళ్లు మించకూడదు. రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక: అకడమిక్ మెరిట్‌కు 75 శాతం; అనుభవానికి 15 శాతం; సీనియారిటీకి గరిష్ఠంగా 10 మార్కులు వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300
దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: అక్టోబరు 5
వెబ్‌సైట్: http://cfw.ap.nic.in
Updated Date - 2023-09-27T12:44:25+05:30 IST