ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు సిల్వర్‌ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ABN, First Publish Date - 2023-04-17T17:51:16+05:30

కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌(అటానమస్‌, కో ఎడ్యుకేషన్‌)-‘సిల్వర్‌ సెట్‌ 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా పలు డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. ఒక్కో కోర్సు వ్యవధి

Kurnool
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌(అటానమస్‌, కో ఎడ్యుకేషన్‌)-‘సిల్వర్‌ సెట్‌ 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా పలు డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. ఒక్కో కోర్సు వ్యవధి మూడేళ్లు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. కోర్సులో భాగంగా ఫీల్డ్‌ ట్రిప్స్‌, డిజిటల్‌ అసైన్‌మెంట్స్‌, ఈ లెర్నింగ్‌, గ్రూప్‌ డిస్కషన్స్‌, గెస్ట్‌ లెక్చర్స్‌, కెరీర్‌ గైడెన్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ తదితరాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • డిగ్రీ కోర్సులు-సీట్లు

  • బీఏ(హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌) - 20

  • బీకాం జనరల్‌ - 20

  • బీఎస్సీ(మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) - 30

  • బీకాం(కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) - 20

  • బీఎస్సీ(మేథ్స్‌, ఫిజిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌) - 50

  • బీఎస్సీ(మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌) - 20

  • బీఎస్సీ(మేథ్స్‌, ఫిజిక్స్‌, వెబ్‌టెక్నాలజీ) - 20

  • బీఎస్సీ(బోటనీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ) - 20

  • బీఎస్సీ(జువాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ) - 20

  • బీఎస్సీ(హార్టికల్చర్‌, బోటనీ, కెమిస్ట్రీ) - 20

  • బీఎస్సీ(జువాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ) - 20

  • బీఏ(హిస్టరీ, ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌) - 20

అర్హత: అభ్యర్థులు ఎంచుకొనే డిగ్రీ కోర్సును అనుసరించి ఎంపీసీ/బైపీసీ/ఏదేని గ్రూప్‌తో ఇంటర్‌/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీ్‌షలో కనీసం 40 శాతం మార్కులు; మొత్తమ్మీద కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. ఇంటర్‌ స్థాయిలో ఇన్‌స్టంట్‌/సప్లిమెంటరీ అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు.

సిల్వర్‌ సెట్‌ 2023 వివరాలు: దీనిని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. డిగ్రీ కోర్సులకు నిర్దేశించిన ప్రకారం మూడు పేపర్లు ఉంటాయి. అదనంగా ఇంగ్లీష్‌ పేపర్‌ అందరికీ కామన్‌గా ఉంటుంది. ఏపీ ఇంటర్‌ సిలబస్‌ ఆధారంగా మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలను ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు. పేపర్‌కు 25 మార్కులు చొప్పున మొత్తం మార్కులు 100. నెగెటివ్‌ మార్కులు లేవు. పరీక్ష సమయం 100 నిమిషాలు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.600

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 6

అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడింగ్‌: మే 18 నుంచి

సిల్వర్‌ సెట్‌ 2023 తేదీ: మే 25

వెబ్‌సైట్‌: sjgckurnool.edu.in

Updated Date - 2023-04-17T17:51:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising