ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC paper leak: ఆమెను 20 గంటలు విచారిస్తే తేలిందిదీ!

ABN, First Publish Date - 2023-04-03T12:08:02+05:30

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC paper leak) వ్యవహారం మొత్తం ఆ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ చుట్టూనే తిరుగుతోంది

TSPSC paper leak
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సమన్వయ లోపం వల్లే లీకేజీ!

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సెక్రటరీ, సెక్షన్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణ లోపమే..

ఇదే అదనుగా పేపర్ల దొంగిలింత.. చైర్మన్‌ వివరణ కోరనున్న సిట్‌

ఆ ఉద్యోగులకు ముగిసిన కస్టడీ.. జైలుకు తరలింపు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC paper leak) వ్యవహారం మొత్తం ఆ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ చుట్టూనే తిరుగుతోంది. అత్యంత విశ్వసనీయంగా ఉండాల్సిన ఆ సెక్షన్‌లో నిఘా వైఫల్యం ఉన్నట్లు వెల్లడి కావడంతో.. సిట్‌ అధికారులు ప్రస్తుతం అదే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ (Confidential Section) ఆఫీసర్‌ శంకరలక్ష్మిని 10 దఫాలుగా సుమారు 20 గంటలు విచారించారు. ప్రశ్నపత్రాల భద్రత, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను నిందితుడు ప్రవీణ్‌ (Praveen) ఎలా తెలుసుకున్నాడు.. అనే విషయాలపై వివరాలు సేకరించారు. ఆ తర్వాత టీఎస్‌పీఎస్సీ (TSPSC) సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను విచారించారు.

వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ భద్రత, పర్యవేక్షణలో చైర్మన్‌, సెక్రటరీ, సెక్షన్‌ ఆఫీసర్‌ మధ్య పూర్తిగా సమన్వయ లోపం ఉన్నట్లు సిట్‌ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. అదే అవకాశంగా భావించిన సెక్రటరీ పీఏ ప్రవీణ్‌, నెట్‌వర్క్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌పై పూర్తి బాధ్యత, అత్యున్నత అధికారాలు ఉన్న చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి నుంచి ఇందుకు సంబంధించి వివరణ కోరడానికి సిట్‌ సిద్ధమైంది. ఆయన వెల్లడించే సమాచారం కీలకంగా మారనుంది. మొత్తం విచారణను పూర్తి చేసి రిపోర్టును సీల్డ్‌ కవర్‌లో ఈ నెల 11 వరకు న్యాయస్థానానికి అందజేయాల్సి ఉండటంతో సిట్‌ అధికారులు దూకుడు పెంచారు.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల కస్టడీ పూర్తి..

గ్రూప్‌-1 ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉండి అరెస్టయిన ఇద్దరు టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఉద్యోగులు షమీమ్‌, రమేశ్‌తోపాటు.. మాజీ ఉద్యోగి సురేశ్‌ను పోలీస్‌ కస్టడీకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారంతో వారి కస్టడీ పూర్తవడంతో పోలీసులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరిచి సాయంత్రం చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీలో ఘటనలో అరెస్టయిన మరో ముగ్గురు నిందితులు ప్రశాంత్‌, తిరుపతయ్య, రాజేందర్‌లను పోలీస్‌ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల కస్టడీ ముగియడంతో.. ఈ ముగ్గురు నిందితులను కస్టడీకి అనుమతించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థులందరినీ సిట్‌ అధికారులు విడతలవారీగా పిలిచి విచారించారు. వారి వివరాలను, బ్యాక్‌గ్రౌండ్‌ను చెక్‌ చేశారు. వారి సామర్థ్యాలను, ప్రతిభాపాటవాలను క్రాస్‌ చెక్‌ చేయడానికి ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలను వారి ముందుంచి సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. 121 మందిలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు షమీమ్‌, రమేశ్‌, మాజీ ఉద్యోగి సురేశ్‌తోపాటు.. న్యూజిలాండ్‌ నుంచి వచ్చి గ్రూప్‌-1 పరీక్ష రాసి 103 మార్కులు సాధించిన రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌రెడ్డి నిందితులుగా తేలినట్లు సిట్‌ వెల్లడించింది.

Updated Date - 2023-04-03T12:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising