ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Education: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ నోటిఫికేషన్

ABN, First Publish Date - 2023-08-11T15:49:49+05:30

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో కేటగిరీ-1 కింద పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సోషల్‌ సైన్సెస్‌, ఆర్ట్స్‌, ఎడ్యుకేషన్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, సైన్స్‌, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, కామర్స్‌ విభాగాల్లో

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో కేటగిరీ-1 కింద పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సోషల్‌ సైన్సెస్‌, ఆర్ట్స్‌, ఎడ్యుకేషన్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, సైన్స్‌, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, కామర్స్‌ విభాగాల్లో ఆగస్టు 14లోపు దరఖాస్తులను సంబంధిత ఫ్యాకల్టీల డీన్‌ కార్యాలయంలో అందజేయాలి. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ), జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషి్‌ప(జేఆర్‌ఎఫ్‌) సాధించిన వారితోపాటు ఇతర సంస్థల నుంచి జాతీయ ఫెలోషిప్‌ పొందినవారు ఈ దరఖాస్తులకు అర్హులు.

ప్రోగ్రామ్‌: డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ(పీహెచ్‌డీ)

ఫ్యాకల్టీలు: సోషల్‌ సైన్సెస్‌, ఆర్ట్స్‌, ఎడ్యుకేషన్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, సైన్స్‌, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, కామర్స్‌.

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు యూజీసీ-జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషి్‌ప(జేఆర్‌ఎఫ్‌) సాధించిన వారితోపాటు ఇతర సంస్థల నుంచి జాతీయ షెలోషిప్‌ పొందిన వారు ఈ దరఖాస్తుకు అర్హులు.

దరఖాస్తు విధానం: వర్సిటీ వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికెట్‌ల జిరాక్స్‌ కాపీలను జతచేసి హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలోని సంబంధిత విభాగాల డీన్‌ కార్యాలయాలకు పంపించాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 14

వెబ్‌సైట్‌: https://www.osmania.ac.in/

Updated Date - 2023-08-11T15:49:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising