ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Education: ప్రైవేట్‌ స్కూళ్లకు షాకిచ్చిన టీచర్లు.. కారణమిదే..!

ABN, First Publish Date - 2023-09-20T12:17:58+05:30

చాలా విరామం తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కానుండడంతో బీఈడీ, డీఈడీ అభ్యర్థులంతా ఇప్పటి వరకు చేస్తున్న ఉద్యోగాలను పక్కన పెట్టి.. కోచింగ్‌లకు పరుగులు పెడుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల టీచర్లు

  • ప్రైవేట్‌ స్కూళ్ల వెతుకులాట

  • డీఎస్సీ నేపథ్యంలో మానేస్తున్న కొందరు

  • సబ్జెక్ట్‌ టీచర్లు లేక ఇబ్బంది

  • బడ్జెట్‌, వెల్ఫేర్‌ కమిటీ స్కూళ్లకు పరేషాన్‌

  • మున్ముందు మరింత తగ్గే అవకాశం

చాలా విరామం తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కానుండడంతో బీఈడీ, డీఈడీ అభ్యర్థులంతా ఇప్పటి వరకు చేస్తున్న ఉద్యోగాలను పక్కన పెట్టి.. కోచింగ్‌లకు పరుగులు పెడుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల టీచర్లు ఎక్కువ మంది విధులకు దూరంగా ఉండడం వల్ల ఆయా విద్యాసంస్థల్లో బోధనలు కుంటుపడుతున్నాయి. ఇప్పటికే కొంతమంది విధులకు రామని చెప్పగా.. మరికొంతమంది అక్టోబర్‌ 1 నుంచి మానేస్తున్నామని లెటర్లు ఇస్తుండడంతో ప్రైవేట్‌ విద్యాసంస్థల నిర్వాహకులు దిక్కుతోచకున్నారు. ప్రధానంగా 7 నుంచి 10వ తరగతికి పాఠాలు చెప్పేందుకు సబ్జెక్ట్‌ టీచర్లు లేక ఏం చేయాలో తెలియని పరిస్థితి.

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 4,667 ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. ఇందులో 48 శాతం కార్పొరేట్‌, టెక్నో స్కూళ్లుగా కొనసాగుతుండగా.. 52 శాతం బడ్జెట్‌ పాఠశాలలుగా నడుస్తున్నాయి. 2022-23 గణాంకాల ప్రకారం ఆయా విద్యాసంస్థల్లో ప్రస్తుతం 20,86,083 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో స్కూల్‌లో ఇద్దరు, ముగ్గురు ప్రైవేట్‌ స్కూళ్లలో ఉపాధ్యాయులు తగ్గుతున్నారు. గ్రేటర్‌లోని 25 శాతం పాఠశాలల్లో ఇంగ్లిష్‌, గణితం, సైన్స్‌, సోషల్‌ బోధించే ఉపాధ్యాయులు డీఎస్సీ నేపథ్యంలో ఉద్యోగం మానేస్తున్నామని ఇప్పటికే యాజమాన్యాలకు చెప్పడంతో వారు హైరానా పడుతున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది మానేస్తే విద్యార్థులకు తరగతులు నిర్వహించడం ఇబ్బందిగా మారుతుందని యాజమాన్యాలు ఆందోళనలు చెందుతున్నాయి. ఈ క్రమంలో ‘టీచర్స్‌ వాంటెడ్‌’ అంటూ పాఠశాలల ఎదుట బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో ఇప్పటికే ఫార్మాటివ్‌ అసె్‌సమెంట్‌-2 పరీక్షలు ముగిశాయి. అక్టోబర్‌ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెటివ్‌ అసె్‌సమెంట్‌-1కు షెడ్యూల్‌ విడుదల కావడం, మరోవైపు టీచర్లు మానేస్తుండడంతో పరీక్షల సమయంలో బోధనలు, నిర్వహణ ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది.

ప్రత్యామ్నాయం కోసం పాట్లు..!

క్వాలిఫైడ్‌ టీచర్లు స్కూల్‌కు రాకపోవడంతో యాజమాన్యాలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. కార్పొరేట్‌, టెక్నో స్కూళ్లలో టీచర్ల కొరత ప్రభావం అంతగా లేకున్నప్పటికీ.. బడ్జెట్‌, వెల్ఫేర్‌ కమిటీ పాఠశాలల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సబ్జెక్ట్‌ టీచర్లు మానేస్తుండడంతో తప్పనిసరి పరిస్థితిలో 5, 6, 7వ తరగతులు బోధించే వారితోనే ఇతర క్లాసులు చెప్పిస్తున్నారు. కొత్త ఉపాధ్యాయులు వచ్చే వరకు సహకరించాలని సూచిస్తున్నారు.

గ్రేటర్‌లో గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలలు

జిల్లా స్కూళ్లు విద్యార్థులు

హైదరాబాద్‌ 1,886 8,65,648

రంగారెడ్డి 527 5,87,635

మేడ్చల్‌ 385 6,32,800

Updated Date - 2023-09-20T12:24:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising