ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC Paper Leak: పేపర్ లీక్ నేపథ్యంలో కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం.. ఏం చేయబోతోందంటే..

ABN, First Publish Date - 2023-03-21T12:08:11+05:30

టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC Paper Leak) నేపథ్యంలో వాటి పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం

TSPSC Paper Leak
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పేపర్ల రక్షణకు ఐఏఎస్‌!

టీఎస్‌పీఎస్సీలో కస్టోడియన్‌ అధికారి

ఎగ్జామ్స్‌ కంట్రోలర్‌గా కూడా బాధ్యతలు!

నియమించే యోచన చేస్తున్న ప్రభుత్వం

ప్రస్తుతం ఈ బాధ్యతలు చైర్మన్‌ పరిధిలో

పని ఒత్తిడిలో సెక్షన్‌ అధికారిణికి..

ఆమె కంప్యూటర్‌ నుంచే పేపర్లు లీక్‌

కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్‌ బదిలీ!

దిద్దుబాటు చర్యలు చేపట్టిన సర్కారు

పరీక్షల రీ షెడ్యూలుపై కసరత్తు

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC Paper Leak) నేపథ్యంలో వాటి పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పరీక్ష పేపర్లతోపాటు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్ల పరిరక్షణ కోసం టీఎస్‌పీఎస్సీ(TSPSC) కార్యాలయంలో ఐఏఎస్‌ స్థాయి కస్టోడియన్‌ అధికారిని నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు పరీక్షల నిర్వహణకు ప్రత్యేక కంట్రోలర్‌ను కూడా నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. టీఎ్‌సపీఎస్సీలో ప్రస్తుతం కార్యదర్శి పేరిట ఒక ఐఏఎస్‌ అధికారి పోస్టు ఉంది. కొన్ని పరిపాలన వ్యవహారాలను కార్యదర్శి పర్యవేక్షిస్తుండగా, మిగిలిన అనేక పనులు చైర్మన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల భద్రత వంటి అంశాలను నేరుగా చైర్మన్‌ పర్యవేక్షిస్తున్నారు. పని ఒత్తిడి ఉన్న సమయంలో ప్రశ్నపత్రాల భద్రత బాధ్యతలను ఇతర అధికారులకు చైర్మన్‌ బదలాయిస్తున్నారు.

ఈ విధానం గతంలో నుంచే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి కూడా ప్రశ్నపత్రాల భద్రత బాధ్యతలను సెక్షన్‌ అధికారిణి శంకరలక్ష్మికి అప్పగించారు. అయితే నిందితులు ఆమె కంప్యూటర్‌ నుంచే ప్రశ్నపత్రాలను తీసుకుని, లీకేజీకి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్‌ కంట్రోలర్‌తోపాటు ప్రశ్నపత్రాల వంటి ముఖ్యమైన డాక్యుమెంట్ల భద్రత కోసం ఒక కస్టోడియన్‌ అధికారిని నియమించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో జరిగిన సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ పోస్టులో ఐఏఎస్‌ స్థాయి అధికారిని నియమించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సమర్థ అధికారి కోసం చూస్తున్న ట్లు తెలిసింది. ఇకపై ఈ కస్టోడియన్‌ అధికారి పర్యవేక్షణలోనే పరీక్షల విభాగం ఉండబోతోంది. తద్వారా కస్టోడియన్‌ సెక్షన్‌ను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

కమిషన్‌ కార్యదర్శి బదిలీ..

టీఎస్‌పీఎస్సీలో ప్రస్తుతం కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారిణిని బదిలీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో మరో ఐఏఎస్‌ అధికారిని నియమించే అవకాశం ఉంది. మరోవైపు పరీక్షల రీషెడ్యూల్‌పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమవారంటీఎ్‌సపీఎస్సీ పాలకమండలి ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. పరీక్ష పేపర్ల లీకేజీ కారణంగా ఇప్పటికే నాలుగు పరీక్షలను రద్దు చేయడంతోపాటు రెండు పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా, ఇందులో గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని ఇప్పటికే ప్రకటించారు. ఇంకా ఐదు పరీక్షల తేదీలను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై, ఆగస్టు వంటి నెలల్లో జరగాల్సిన ఇతర పరీక్షల తేదీలను గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం రద్దయిన పరీక్షలను మళ్లీ నిర్వహించాలంటే.. జరగబో యే పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంది. వీటితోపాటు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంసెట్‌, లాసెట్‌ వంటి పరీక్షలు, జాతీయ స్థాయిలో ఉద్యోగాల నియామక పరీక్షల షెడ్యూల్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలకు ఇబ్బంది కలగకుండా రద్దయిన పరీక్షల తేదీలను ప్రకటించడంపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు.

Updated Date - 2023-03-24T12:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising