ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Education: మూడో శనివారం పుస్తకాలకు విరామం! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ABN, First Publish Date - 2023-07-07T11:54:21+05:30

ప్రతి నెలా మూడో శనివారం బ్యాగ్‌ రహితంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేలా విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ‘బ్యాగ్‌ రహిత లేదా సంబ్రమ శనివారం’గా మూడో శనివారాన్ని నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూలై 6(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ప్రతి నెలా మూడో శనివారం బ్యాగ్‌ రహితంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేలా విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ‘బ్యాగ్‌ రహిత లేదా సంబ్రమ శనివారం’గా మూడో శనివారాన్ని నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే విద్యార్థులకు తరగతుల వారీగా బ్యాగుల తూకాన్ని నిర్ణయించిన విద్యాశాఖ, తాజాగా ఒత్తిడిని తగ్గించే దిశగా ఆదేశాలు జారీ చేసింది. మూడో శనివారం విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ పుస్తకాలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ రోజున పాఠ్యాంశాలతో సంబంధం లేని కార్యక్రమాలను నిర్వహిస్తారు. పాఠశాలల సమయంలో కూడా ఎటువంటి మార్పులు ఉండవు. విద్యాపరిశోధనా విభాగం సూచనలకు అనుగుణంగానే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈనెల 15 నుంచి బ్యాగ్‌ రహిత పాఠశాలలు అమలవుతాయి.

Updated Date - 2023-07-07T11:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising