ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLC Kavitha: డిసెంబర్ 3 తర్వాత మళ్లీ ఏర్పడేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే

ABN, First Publish Date - 2023-10-10T15:36:39+05:30

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం కంటేశ్వర్‌లో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు.

నిజామాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. మంగళవారం కంటేశ్వర్‌లో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవితకు గీతకార్మిక కుటుంబాలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ... కన్న తల్లి వంటి కులవృత్తులకు బీఆర్‌ఎస్ (BRS) పాలనలో పూర్వ వైభవం లభించిందన్నారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను, కల్లు వ్యాపారాన్ని చిన్న చూపు చూశారన్నారు. అలాంటి కులవృత్తులను పునరుద్ధరించెందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పాలసీగా తీసుకొని ఈత వనాలని పెంచుతుందన్నారు. మద్యం టెండర్లలో 15 శాతం గౌడ కులస్తులకు రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాకు ఒకటే బీసీ హాస్టల్ ఉండేదని... అలాంటిది ఈరోజు 15 బీసీ హాస్టల్‌లను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తెలంగాణలోఉన్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదు బీసీల ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. ఎన్నికలప్పుడు అనేక పార్టీలు వస్తాయని.. వారిని నిలదీయాలని అన్నారు. డిసెంబర్ 3 తర్వాత మళ్లీ ఏర్పడేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని కవిత దీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-10T16:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising