Dinner Facts: రాత్రిపూట పొరపాటున కూడా ఈ 5 ఆహారాలు తినకండి.. లేకపోతే చాలా నష్టపోతారు!!
ABN, Publish Date - Dec 19 , 2023 | 01:22 PM
ఎంతో ఆరోగ్యం అనుకుంటూ రాత్రిపూట అందరూ తింటున్న ఈ ఆహారాలతో ఎంత ప్రమాదమంటే..
ఆహారమే శరీరానికి శక్తివనరు. అయితే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా తినే ఆహారం వేరు వేరుగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండటం సాధ్యం అవుతుంది. చాలా ఇళ్ళలో రాత్రి సమయంలో ఆహారం విషయంలో పెద్ద పొరపాట్లు జరిగిపోతున్నాయి. ఎంతో ఆరోగ్యం అనుకుంటూ అందరూ తింటున్న ఆహారం శరీరానికి పెనుముప్పుగా మారుతున్నాయని పోషకాహార నిపుణులు, ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆహారాలు ప్రేగు సంబంధ వ్యాధులు, హార్మోన్ అసమతుల్యత, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలకు కారణం అవుతున్నాయి. రాత్రిపూట అస్సలు తినకూడని ఆహారాలేంటో తెలుసుకుంటే..
గోధుమ ఆధారిత ఆహారాలు..
చాలా ఇళ్ళలో రాత్రపూట చపాతీ తినడం కామన్ అయ్యింది. ఇది బరువును నియంత్రిస్తుందని చెబుతారు. కానీ గోధుమలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు ఇది అమాను కలిగిస్తుంది. అమా అంటే ఆయుర్వేదంలో జీర్ణం కాకుండా చెల్లాచెదురైన ఆహార స్థితి. ఇది కడుపులో విషం లాగా పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి: వంటలలో వాడే ఇంగువ.. వీరికి సేఫ్ కాదు!
పెరుగు..
రాత్రిపూట పెరుగు తింటే కఫం పెరుగుతుంది. జలుబు, దగ్గు వచ్చినప్పుడు పెరుగు అస్సలు తినకూడదు. ఒకవేళ రాత్రిపూట పెరుగు తినాలని అనుకుంటే అందులో మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని తినాలి.
మైదా..
మైదా సాధారణంగానే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతారు. ఇక దీన్ని రాత్రి భోజనంలో తింటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మధుమేహం, ఊబకాయం చాలా ఈజీగా వస్తుంది. భోజనంలో సమోసా, మోమోస్, నూడిల్స్, నాన్, రుమాలీ రోటీ వంటివి అసలు తినకూడదు.
ఇది కూడా చదవండి: Viral Video: ఈ తేనెటీగల టీమ్ వర్క్ అదుర్స్.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా..!
తీపి పదార్థాలు..
తీపి రుచి కలిగిన ఆహారం తినడం సులువే కానీ అది జీర్ణం కావడం మాత్రం చాలా నెమ్మది. తీపి పదార్థాలు తింటే శ్లేష్మం పెరుగుతుంది. గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, సత్తువ లోపించడం, పొడిచర్మం వంటి సమస్యలు వస్తాయి.
సలాడ్..
డైటింగ్ చేసేవారు ఎక్కువగా సలాడ్ తింటారు. అయితే రాత్రిపూట సలాడ్ తింటే వాత సమస్యలు పెరుగుతాయి. రాత్రి భోజనంలో కూరగాయలు తినాలంటే వాటిని ఆవిరి మీద ఉడికించాలి. ఆ తరువాత ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తినాలి. అంతేకానీ పచ్చివి తినకూడదు.
ఇది కూడా చదవండి: Viral Video: వామ్మో ఈ పిల్లకు ఎంత ధైర్యం.. బైక్ రన్నింగ్ లో ఉన్నా సరే.. పాట వినబడగానే ఏం చేసిందంటే..
Updated Date - Dec 19 , 2023 | 01:22 PM