Parkinson's Disease : మెదడును శాశ్వతంగా దెబ్బ తీసే ఈ వ్యాధి గురించి మీకు తెలుసా? కనీసం రోజువారీ పనులు చేసుకోవాలన్నా కష్టమే..
ABN, First Publish Date - 2023-04-11T12:24:55+05:30
పార్కిన్సన్స్ వ్యాధి దీని పేరు వినడమే తప్ప అసలు దీనికి సంబంధించిన వివరాలేంటనేది చాలా మందికి తెలియదు. పార్కిన్సన్ వ్యాధి అనేది చాలా అరుదుగా సంభవిస్తుంది కానీ ఇది మెదడు కణాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.
Parkinson's Disease : పార్కిన్సన్స్ వ్యాధి దీని పేరు వినడమే తప్ప అసలు దీనికి సంబంధించిన వివరాలేంటనేది చాలా మందికి తెలియదు. పార్కిన్సన్ వ్యాధి అనేది చాలా అరుదుగా సంభవిస్తుంది కానీ ఇది మెదడు కణాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ వ్యాధి కారణంగా మెదడులోని కదలికను నియంత్రించే సబ్‌స్టాంటియా నిగ్రాలో నరాల కణాలు దెబ్బతినడం జరుగుతుంది. కీలకమైన న్యూరోట్రాన్స్‌మిటర్ డోపమైన్‌ను తయారు చేసే సామర్థ్యాన్ని తగ్గించడం వల్ల కణాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మెదడుకు శాశ్వత నష్టం అనేది జరుగుతుంది.
మెదడును ఎలా దెబ్బతీస్తుంది?
కొన్ని పరిశోధనలు కొన్ని టాక్సిన్స్ వంటి పర్యావరణ కారకాలు నాడీ వ్యవస్థను ఇబ్బంది పెట్టవచ్చని చెబుతున్నాయి. ఇది జన్యుపరంగా కూడా సంక్రమిస్తుంది. ఇక మెదడులోని వివిధ భాగాల్లో క్లంప్స్ ఏర్పడటం వల్ల కూడా ఇది సంభవిస్తుంది. నెమ్మదిగా లక్షణాలు ప్రారంభమై కాలక్రమేణా పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుంది. ఇక మరింత తీవ్రమయ్యాక మాట్లాడటం, నడవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రవర్తనలో మార్పు వస్తుంది. మానసిక మార్పులు, నిద్రలేమి, నిరాశ, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా 60 ఏళ్లు దాటిన వ్యక్తులు పార్కిన్‌సన్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అయితే 5% నుంచి 10% మందిలో మాత్రం ఈ సమస్య 50 ఏళ్లలోపే ఎదురవుతుంది.
ఇవి కూడా చదవండి
ఉప్పు సరిపోలేదని ఇలా మళ్లీ చల్లే అలవాటుందా..? సరిపోయింది.. ఇలా చేస్తే..
ఈ ఎర్ర బియ్యం గురించి ఎంతమందికి తెలుసు.. ఈ బియ్యం తింటే ఏం జరుగుతుందంటే..
మెదడు దెబ్బతినడంతో ఎదురయ్యే సమస్యలు..
కండరాల బలహీనత కారణంగా.. కండరాల నియంత్రణ సమస్య తలెత్తుతుంది
పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నవారిలో దాదాపు 80% మంది చురుకుగా కదలలేరు. దీంతో వారికి సాధారణ వణుకు అనేది వస్తుంది.
ముఖ కండరాలపై నియంత్రణ తగ్గడం.. చేతిరాతలో మార్పు.. మింగడంలో ఇబ్బంది వంటి సమస్యలు పార్కిన్‌సన్ వ్యాధి కారణంగా తలెత్తుతాయి. రోజువారీ పనులను చేయడానికి కూడా ఈ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడతారు.
స్ట్రెయిట్ బ్యాక్స్, ఆర్మ్ రెస్ట్‌లు, దృఢమైన సీట్లు ఉన్న కుర్చీలను ఉపయోగించడం వల్ల రోగులకు లేచి కూర్చోవడం సులభం అవుతుంది.
గదిని ఎప్పుడూ కాంతివంతంగా ఉంచడంతోపాటు గది ఉష్ణోగ్రతను నిర్వహించడం వల్ల రోగికి విశ్రాంతి లభిస్తుంది.
ఇంటి ప్రతి ఇంటర్వల్‌లో తప్పనిసరిగా హ్యాండ్‌రైల్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇది కదులుతున్నప్పుడు రోగికి సహాయంగా ఉంటాయి.
డాక్టర్ నంబర్‌ను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Updated Date - 2023-04-11T17:51:03+05:30 IST