ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hair Loss: వెంట్రుకలు రాలిపోకుండా ఉండాలని జుట్టుకు ఉల్లిగడ్డ రసం గానీ అప్లై చేస్తున్నారా..?

ABN, First Publish Date - 2023-04-03T11:09:06+05:30

మెరిసే, దృఢమైన జుట్టు కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. నెత్తిపై జుట్టు ఊడుతోందా? కాలి కింద భూమి కదులుతున్న ఫీలింగ్ కలుగుతుంది చాలా మందికి. ఇక వెంటనే దీనికి పరిష్కార మార్గాలను వెదుకుతారు. వాటిలో ఒకటి తలపై ఉల్లిపాయ రసాన్ని అప్లై చేయడం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మెరిసే, దృఢమైన జుట్టు కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. నెత్తిపై జుట్టు ఊడుతోందా? కాలి కింద భూమి కదులుతున్న ఫీలింగ్ కలుగుతుంది చాలా మందికి. ఇక వెంటనే దీనికి పరిష్కార మార్గాలను వెదుకుతారు. వాటిలో ఒకటి తలపై ఉల్లిపాయ రసాన్ని అప్లై చేయడం. ఇది ఎప్పటి నుంచో ప్రజలు అనుసరిస్తున్న మార్గం. వంటగదిలో సులభంగా లభించే ఈ సహజమైన హెయిర్ మాస్క్‌తో చాలా మంది ప్రయోజనం పొందుతున్నారని టాక్. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టి.. జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది.

ఉల్లిపాయలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు విరిగిపోవడం.. పల్చబడడాన్ని నిరోధిస్తుంది. వెంట్రుకల కుదుళ్లు బలంగా పెరగడానికి సల్ఫర్ కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఉల్లిపాయ రసంలో జుట్టు చిన్న వయసులోనే నెరసిపోకుండా కూడా సహాయపడుతుంది.

అయితే ఓ స్కిన్ స్పెషలిస్ట్ మాత్రం ఇదంతా అపోహ మాత్రమేనని.. దీనికి శాస్త్రీయ అధ్యయనం అంటూ ఏమీ లేదని చెప్పారు. దీనికి కారణాలను సైతం వెల్లడించారు. ఉల్లిపాయ కారణంగానే జుట్టు పెరిగితే బట్టతల ఉన్నవారు ఉండరని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఉల్లిపాయ రసాన్ని తలపై రుద్ది జుట్టును పెంచుకుంటారు. ముఖ్యంగా ఉల్లిపాయ రసం కారణంగా మగవారిలో జుట్టు పెరుగుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని సదరు స్కిన్ స్పెషలిస్ట్ చెబుతున్న మాట. నిజానికి చిరాకు, రాషెస్, కాలిన గాయాలు వంటి వాటి కారణంగా కూడా జుట్టు రాలడం జరుగుతుంటుంది. ఉల్లిపాయ రసాన్ని తలపై రాయడం కారణంగా జుట్టు పెరగడం అనేది జరగదని స్కిన్ స్పెషలిస్టులు చెబుతున్నారు.

Updated Date - 2023-04-03T11:10:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising