ఇలా చేస్తే మోకాళ్ల నొప్పులు, ఎసిడిటీకి ఉపశమనం
ABN, First Publish Date - 2023-02-17T13:15:54+05:30
బీజీ జీవితంలో అనారోగ్యానికి గురవుతున్నారా.. కాళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. కడుపులో ఎసిడిటా.. ఎముకలు బలహీన పడుతున్నాయా..
డీ విటమిన్ లోపమూ నివారణ
కూర్చుని భోజనం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు?
బీజీ జీవితంలో అనారోగ్యానికి గురవుతున్నారా.. కాళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. కడుపులో ఎసిడిటా.. ఎముకలు బలహీన పడుతున్నాయా.. ప్రతీదానికి వైద్యం కోసం పరిగెత్తేకంటే ఇంటి చిట్కాలు.. హెల్తీటిప్స్ పాటిస్తే ఉపసమనం లభిస్తుంది. నువ్వులు, పసుపు, నెయ్యి, బెల్లం, ఉదయం ఎండతో అనేక రకాల నొప్పులకు సహజంగా చెక్ పెట్టొంచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
హైదరాబాద్: జీవన విధానం, ఆహారపు అలవాట్లు మారడంతో మోకాళ్లు నొప్పులు (knee pain) చాలా మందికి వస్తున్నాయి. ఈ ఆధునిక లైఫ్ స్టైల్ (Life style) మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కింద కూర్చుని తినకపోవడం వల్ల మోకాళ్ల నొప్పులు అధికం అవుతున్నాయి. పూర్వం అందరూ కింద కూర్చొని తినేవారు. వాకింగ్ (Walking) లేకపోవడం సమస్యగా మారుతోంది. ఈ మోకాళ్ల నొప్పులు మగవాళ్లుకంటే ఆడవాళ్లకే అధికంగా ఉంటాయి. ఎందుకంటే పీరియడ్స్ సమయంలో వారికి విశ్రాంతి లేకపోవడం, హార్మోన్లను కోల్పోవడం సమస్యగా మారుతుంది. పాతకాలంలోనైతే పీరియడ్స్ మూడు రోజులు మహిళలు ఎలాంటి పనులూ చేయకుండా విశ్రాంతిగా ఉండేవారు. ఇవన్నీ కూడా లైఫ్‌స్టైల్ మారడంతో పద్ధతులు మార్చుకున్నారు. అవి మోకాళ్ల నొప్పులకు, ఇతర సమస్యలకు దారితీస్తున్నాయి.
ఏం తింటున్నాం?
మనం తినే ఆహారం మార్చడం కూడా సమస్యగా మారింది. పాలీస్ రైస్ తింటున్నాం. ఇదీ సమస్యనే. గతంలో నువ్వులనూనె తినేవాళ్లం. అది ఇప్పుడు మానేశాం. నేడు మార్కెట్‌లో ఉన్న నూనె కూడా కోల్డ్ కాంప్రెస్డ్ పద్ధతితో తీసినవికావు. అవన్నీ వాడడం వల్ల సమస్యలు వస్తున్నాయి. నేడు మార్కెట్‌లో నూనెల్లో కాల్షియం అస్సలు ఉండడం లేదు. అధికంగా కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడం కూడా సమస్యకు దారితీస్తుంది. దీంతో బరువు పెరిగి ఎముకలు దఢత్వాన్ని కోల్పోతున్నాయి.
ఒక స్పూన్ నెయ్యి...
గతంలో అన్నం తినేముందు ఒక స్పూన్ నెయ్యి వాడేవాళ్లం. ఇప్పుడు ఫ్యాట్ పేరుతో అందరూ నెయ్యికి దూరంగా ఉంటున్నారు. ఇదో సమస్యే. నెయ్యి తినడం వల్ల స్కిన్ లోపలిభాగంలో ఎడిబోటీస్యూ ఉంటుంది. ఆ నెయ్యి వల్ల ఎండ శరీరానికి తాకగానే విటమిన్ డి3 ఏర్పడి మనకు శరీరానికి చేరేది. విటమిన్- డి పుష్కలంగా ఉంటే చాలా ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి, మోకాళ్ల నొప్పులు అస్సలేరావు. విటమిన్ డి3 కాల్షియంను అందిస్తుంది.
ఇంటి చిట్కా ఏమిటంటే..
100 గ్రాముల నువ్వులు, 50 గ్రాముల పసుపు, 50 గ్రాముల నెయ్యి, 50 గ్రాముల బెల్లం ఇవన్నీ కలపి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ప్రతీరోజూ 10 గ్రాములు తినాలి. డయాబెటిక్ పేషెంట్‌లు అయితే బెల్లం ఒక్కటి మినహాయించుకోవాలి. ప్రతీరోజూ తిన్నా ఏమీకాదు, నెలకు 20 రోజులు కచ్చితంగా తినాల్సిందే. మహిళలు పీరియడ్స్ సమయంలో వీటిని తినకూడదు. ఈ మందుతో మోకాళ్ల నొప్పులు దూరం అవుతాయి. ఎసిడిటీ సమస్య రాదు, కాల్షియం ఒంటికి చేరుతుంది. ప్రతీరోజూ అరగంట కచ్చితంగా ఉదయం ఎండలో ఉండాలి.
డాల్డాతో అనారోగ్యం...?
నెయ్యి వదిలేసి డాల్డాకు వచ్చాం. ఇక్కడ ఫ్యాట్ మారింది, రోగాలు దరిచేరాయి. మన శరీరంలో మంచి ఫ్యాట్ కంటే చెడు ఫ్యాట్ అధికంగా చేరుతుంది. ఎండలో ఉన్న విటమిన్ డి నేరుగా రావాలంటే మనం నెయ్యి తినాల్సిందే. నెయ్యిలేకపోతే విటమిన్ డి మనకు రాదు. నైట్ డ్యూటీ చేసేవారికి, అధికంగా టెన్షన్ పడేవారికి ఎసిడీటీ ఫామ్ అవుతుంది. ఆ ఎసిడీటీ కాల్షియంను ఒంటికి చేరనివ్వద్దు. దీంతో ఆర్థోటైటీస్, మోకాళ్ల నొప్పులు వస్తాయి.
Updated Date - 2023-02-17T13:16:57+05:30 IST