ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hair loss: జుట్టు రాలకుండా ఉండాలంటే..

ABN, First Publish Date - 2023-07-24T13:03:44+05:30

వెంట్రుకలు ఊడిపోతుంటే భయమేస్తోందా? రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు ఊడటం, వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు పెరగటం సహజం. అయితే వెంట్రుకలు ఊడిన చోట ఖాళీ ఏర్పడినా, తల పల్చబడుతున్నా వెంట్రుకలు అసహజంగా ఊడిపోతున్నట్టు భావించాలి.

వెంట్రుకలు ఊడిపోతుంటే భయమేస్తోందా? రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు ఊడటం, వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు పెరగటం సహజం. అయితే వెంట్రుకలు ఊడిన చోట ఖాళీ ఏర్పడినా, తల పల్చబడుతున్నా వెంట్రుకలు అసహజంగా ఊడిపోతున్నట్టు భావించాలి. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలుంటాయి. వంశపారంపర్యంగా సంక్రమిస్తే బట్టతల, నుదురు దగ్గర వెంట్రుకలు ఊడటం, స్త్రీలలో జుట్టు పలుచబడటంలాంటివి కనిపిస్తాయి. కుదుళ్ల ఇన్‌ఫెక్షన్లు, హార్మోన్లలో అవకతవకల వల్ల కూడా జుట్టు రాలుతుంది. గర్భనిరోధక మాత్రలు, కేన్సర్‌, ఆర్థ్రయిటిస్‌, అధిక రక్తపోటు కూడా వెంట్రుకలు రాలటానికి కారణాలవుతాయి. కాబట్టి ఈ సమస్యలుంటే వాటికి చికిత్స తీసుకోవాలి. దాంతోపాటు కొన్ని చిట్కాలు పాటించాలి.

  • ఒక టేబుల్‌స్పూన్‌ ఉసిరి పొడికి, 1 టేబుల్‌స్పూన్‌ నిమ్మరసం కలిపి కుదుళ్లకు పట్టించి రాత్రంతా వదిలేసి పొద్దునే తలస్నానం చేయాలి.

  • కలబంద గుజ్జు లేదా రసాన్ని కుదుళ్లకు పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి 3, 4 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

  • ఒక కప్పు మెంతులు రాత్రంతా నీళ్లలో నానబెట్టి పొద్దునే మెత్తగా రుబ్బి వెంట్రుకలకు పట్టించాలి. 40 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజులపాటు చేస్తే ఫలితం ఉంటుంది.

Updated Date - 2023-07-24T13:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising