ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Papaya: ఇది తింటే అబార్షన్ అవుతుందా? చర్మం రంగు మారుతుందా? ఎంత వరకూ నిజం..!

ABN, First Publish Date - 2023-03-16T12:19:06+05:30

బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిండెంట్ కంటెంట్ ఉన్నపండు కనుక రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది.

summer fruit
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బొప్పాయి పండు తెలియని వారుండరు. తినని వారు అంతకన్నా ఉండరు. ఈ పండు సులువుగా అరుగుతుందని, ఆరోగ్యానికి మంచిదనే ఆలోచన మనందరిలోనూ చిన్నతనం నుంచి నాటుకుపోయింది. బొప్పాయి ఆకుల్లోనూ, పండులోనూ చాలా సుగుణాలున్నాయని తెగ నమ్మేస్తూ ఉంటాం. మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలప్పుడు ఫ్లేట్ లెట్స్ పడిపోతే బొప్పాయి ఆకు పసరు తాగించేస్తూ ఉంటాం. న్యూట్రీషియన్ సూపర్ ఫుడ్ . క్యాలరీలు తక్కువ, ఫ్యాట్ ఎక్కువ. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మీడియం సైజ్ బొప్పాయిలో 300శాతం న్యూట్రీషియన్స్ ఉంటాయి. విటమిన్ సి కూడా ఎక్కువ. బరువు తగ్గించుకోవాలనేకునే వారికి కూడా బొప్పాయి చాలా సురక్షితమైనది. అయితే బొప్పాయి నిజంగానే బలవర్థకమైన ఆహారమే అయితే మరి ఈ Side effects మాటేమిటి?

1. అబార్షన్‌కు కారణమవుతుంది:

బొప్పాయిని ఎక్కువగా తిన్నా లేదా పచ్చిబొప్పాయి తిన్నా, అందులో ఉండే ల్యాక్టేషన్ వల్ల యుటేరియన్ మీద ప్రభావం చూపుతుంది. ఇది గర్భిణీల్లో అబార్షన్‌కు కారణమవుతుంది. అబార్షన్, ప్రీమెచ్యుర్ లేబర్, బేబీ అబ్ నార్మలిటీస్‌కు గురిచేస్తుందట.

2. కెరోటినీమాకు గురిచేస్తుంది:

బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల, బొప్పాయిలో ఉండే బీటా కెరోటీన్ కారణంగా చర్మం రంగులో మార్పు తెస్తుంది, దీన్ని వైద్య పరిభాషలో కెరోటినిమా అని పిలుస్తారు. ఈ పరిస్థితిలో కళ్ళు తెల్లగా పాలిపోయి కనబడతాయి, అరచేయి పసుపు రంగులోకి మారుతుంది. ఈ పరిస్థితిలో కామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపలా కునుకేసే అలవాటుందా..? కానీ.. సమస్య ఏంటంటే..

3. రెస్పిరేటరీ డిజార్డర్స్:

బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్, శక్తివంతమైన అలర్జెన్స్‌గా పనిచేస్తాయి, బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల, శ్వాస సమస్యలు, వీజింగ్, నాజల్ ప్యాసే బ్లాక్ అవ్వడం, హెవీ ఫీవర్, ఆస్త్మా వంటి డిజార్డర్స్ వస్తాయి.

4. గుండె జబ్బులున్నా సరే:

గుండె జబ్బలున్నవారు ఈ పండును తినకపోవడమే మంచిది. బొప్పాయిలో ఉండే ఒక రకమైన అమైనో ఆమ్లం కారణంగా ఇది గుండెకు హానికరంగా మారుతుంది. హైపోథైరాయిడిజంతో బాధపడేవారికి ఇది జరగకపోవచ్చు.

5. అలర్జీలు:

బొప్పాయి పండు అందరికీ పడకపోవచ్చు. ఎందుకంటే ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురిచేస్తుంది. ముఖ్యంగా దగ్గు, కళ్ళ నుంచి నీరు కారడం వంచి సమస్యలకు కారణం అవుతుంది. అయితే బొప్పాయి వాసనకే కొందరిలో అలెర్జీ కలుగుతుంది. ఇలాంటి వారు గమనించిన వెంటనే బొప్పాయికి దూరంగా ఉండటం మంచిది.

6. కిడ్నీలో రాళ్ళు ఉన్నా సరే:

బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిండెంట్ కంటెంట్ ఉన్నపండు కనుక రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది. ఈ పండు తింటే కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Updated Date - 2023-03-16T12:19:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising