ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

tDNA: మధుమేహ రోగులకు సరికొత్త ఆహార ప్రణాళిక

ABN, First Publish Date - 2023-03-21T20:16:42+05:30

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఒక్క మనదేశంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఒక్క మనదేశంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 77 మిలియన్లకు పైనే. 2045 నాటికి ఈ సంఖ్య 135 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. గత మూడు దశాబ్దాలుగా మధుమేహ రోగుల సంఖ్య 150 శాతం పెరిగింది.

సామాజిక, ఆర్థిక పరమైన విషయాలతోపాటు పోషక కారకాలలో వేగవంతమైన మార్పులే ఇందుకు కారణం. దీంతోపాటు జీవనశైలి, ఆహార సంబంధిత నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల పెరుగుదలకు దారితీసింది. అయితే, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలన్న విషయంలో అబాట్ న్యూట్రిషన్ బిజినెస్‌ మెడికల్ అఫైర్స్ హెడ్ డాక్టర్ ఇర్ఫాన్ షేక్ మాట్లాడుతూ.. డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి అని, దీనిపై శ్రద్ధ అవసరమని అన్నారు. రోగ నిర్ధారణ చేయకపోతే క్రమంగా గ్లూకోజ్ స్థాయిలు పెరిగి గుండె జబ్బులు, మూత్రపిండాల రుగ్మతలు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతాయన్నారు. డయాబెటిక్ స్పెసిఫిక్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ (DSNS), గ్లూకోజ్ స్థాయిలపై శారీరక శ్రమ వంటి అంశాలతో పోషకాహారం పాత్రను అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

టీడీఎన్ఏ అంటే ఏమిటి?

టీడీఎన్ఏ అంటే ట్రాన్స్ కల్చరల్ డయాబెటిస్ న్యూట్రిషన్ అల్గారిథమ్ (tDNA) అనేది టైప్ 2 డయాబెటిస్, ప్రిడయాబెటిస్ ఉన్న వారికి పోషకాహారన్ని అందించేందుకు పరిచయం చేసిన కొత్త తరం సాధనం. మధుమేహం ఉన్నవారికి పోషకాహార ఇంటర్వెన్షన్స్ ప్రయోజనాలపై అవగాహన పెంచడం, జీవనశైలి, ఆహారాలు, ప్రాంతీయ వ్యత్యాసాలకు అనుగుణంగా ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడం, ఇప్పటికే ఉన్న క్లినికల్ ప్రాక్టీస్ మార్గదర్శకాల (CPG) అమలును మెరుగు పరచడమే దీని లక్ష్యం.

ఆరోగ్యకరమైన ఆహారంలోకి మారినప్పుడు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వచ్చిన ఆహారపు అలవాట్లను మధుమేహ రోగులు వదిలివేస్తుంటారని జోస్లిన్ డయాబెటిస్ సెంటర్‌లోని ఇన్‌పేషెంట్ డయాబెటిస్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఒబేసిటీ క్లినికల్ ప్రోగ్రామ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఒసామా హమ్డీ అన్నారు. కావాల్సినంత తినడం, బరువు తగ్గడం, గ్లైసెమిక్ నియంత్రణ నిర్వహణ వంటివాటికి టీడీఎన్ఏ తోడ్పడుతుందన్నారు.

ఇక, అబాట్ విషయానికి వస్తే ఇదొక గ్లోబల్ హెల్త్ కేర్ లీడర్. ప్రజలు తమ జీవితంలో అన్ని దశలను మరింత సంపూర్ణంగా జీవించడంలో సాయ పడుతుంది. జీవితాన్ని మార్చే సాంకేతికతల పోర్ట్‌ ఫోలియో, రోగనిర్ధారణ, వైద్య పరికరాలు, పోషకాలు, బ్రాండెడ్ జనరిక్ ఔషధాలలో ప్రముఖ వ్యాపారాలు, ఉత్పత్తులతో ఆరోగ్య సంరక్షణ స్పెక్ట్రమ్‌ను విస్తరించింది.

Updated Date - 2023-03-21T20:52:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising