ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan : ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్‌కి ప్రమాదం

ABN, First Publish Date - 2023-03-18T13:17:03+05:30

పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ప్రయాణిస్తున్న వాహన శ్రేణిలోని ఓ కారు శనివారం

Imran Khan Convoy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ప్రయాణిస్తున్న వాహన శ్రేణిలోని ఓ కారు శనివారం ప్రమాదానికి గురైంది. ఆయన సురక్షితంగా ఉన్నట్లు పాకిస్థాన్ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. తోషాఖానా అవినీతి కేసులో కోర్టులో హాజరయ్యేందుకు ఆయన ఇస్లామాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆయన లాహోర్ నుంచి బయల్దేరి, ఇస్లామాబాద్ వెళ్తున్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

లాహోర్‌లో ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు ఇటీవల ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరోధించడంతో అరెస్ట్ చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. దీంతో లాహోర్ హైకోర్టు ఆయన అరెస్టును ఒక రోజు వాయిదా వేసింది.

ఇమ్రాన్ శనివారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, పంజాబ్ పోలీసులు లాహోర్‌లోని తన నివాసంపై దాడి చేశారని, తన నివాసంలో తన సతీమణి బుష్రా బేగమ్ ఒక్కరే ఉన్నారని తెలిపారు. ఏ చట్టం ప్రకారం పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. ఇదంతా లండన్ ప్రణాళిక అని ఆరోపించారు. పరారీలో ఉన్న నవాజ్ షరీఫ్‌ను అధికారంలోకి తేవడం కోసం ‘నీకు ఇది-నాకు అది’ పద్ధతిలో ఈ ప్రణాళిక సాగుతోందన్నారు.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : చిక్కుల్లో రాహుల్‌?

India-Bangladesh : భారత్-బంగ్లాదేశ్ మైత్రీ పైప్‌లైన్ విశేషాలు ఎన్నో....!

Updated Date - 2023-03-18T13:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising