ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China Vs Taiwan : చైనా ఇలాంటి యుద్ధం మొదలెడుతుందని ఎవరూ ఊహించలేదు!

ABN, First Publish Date - 2023-03-08T16:39:43+05:30

చైనా దురాక్రమణ బుద్ధి గురించి అందరికీ తెలుసు. పొరుగు దేశాలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుందని

Chinese ship
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నన్‌గన్ (తైవాన్) : చైనా (China) దురాక్రమణ బుద్ధి గురించి అందరికీ తెలుసు. పొరుగు దేశాలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుందని మళ్లీ మళ్లీ చెప్పనక్కర్లేదు. దాని నైజమే అది. తైవాన్‌ను కూడా చైనా ఇబ్బంది పెడుతోంది. తైవాన్ (Taiwan) ప్రజలకు ఇంటర్నెట్ సేవలు (Internet Services) అందకుండా చేస్తోంది. ఇంటర్నెట్ కేబుల్స్‌ను ధ్వంసం చేస్తోంది.

తైవాన్ నేషనల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (Taiwan National Communications Commission) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ దేశంలోని మట్సు పట్టణవాసులు రెండు సబ్‌మెరీన్ ఇంటర్నెట్ కేబుల్స్‌ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందుతారు. ఈ కేబుల్స్‌ను రెండు చైనీస్ నౌకలు ధ్వంసం చేశాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పట్టణం చైనాకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సుమారు 14 వేల మంది నివసిస్తున్నారు. తైవాన్ మెయిన్ ఐలండ్‌కు ఈ పట్టణం గుండా వెళ్తుంటారు.

చేపల వేట కోసం వచ్చిన చైనా నౌక (Chinese Ship) ఫిబ్రవరి 2న మొదటి కేబుల్‌ను ధ్వంసం చేసిందని, ఫిబ్రవరి 8న వచ్చిన చైనీస్ కార్గో నౌక రెండో కేబుల్‌ను నాశనం చేసిందని తైవాన్ నేషనల్ కమ్యూనికేషన్స్ కమిషన్ తెలిపింది. అయితే దీనికి ఆధారాలు ప్రత్యక్షంగా లేవని తైవాన్ ప్రభుత్వం పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఈ దీవి వాసులు పరిమితమైన మైక్రోవేవ్ రేడియో ట్రాన్స్‌మిషన్ ద్వారా లభించే ఇంటర్నెట్ సేవలపై ఆధారపడవలసి వస్తోంది. ఎస్ఎంఎస్‌ను పంపించడానికి గంటల తరబడి వేచి చూడవలసి వస్తోంది. కాల్స్ విపరీతంగా డ్రాప్ అయిపోతున్నాయి. వీడియోలను చూడటం సాధ్యం కావడం లేదు. ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో పర్యాటకులు తమ బుకింగ్స్‌ను రద్దు చేసుకుంటున్నారు.

ఇంటర్నెట్ కేబుల్స్‌ను ధ్వంసం చేయడం వల్ల ప్రజల జీవితాలకు అంతరాయం కలగడంతోపాటు తైవాన్ భద్రతకు కూడా ముప్పు కలుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేటపుడు ఇంటర్నెట్ సదుపాయాలను దెబ్బతీయడంపై రష్యా ప్రధానంగా దృష్టి సారించిన విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

అవసరమైతే బల ప్రయోగం చేసి అయినా తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలని చైనా భావిస్తోందని, అందుకే ఉద్దేశపూర్వకంగానే ఇంటర్నెట్ కేబుల్స్‌ను ధ్వంసం చేసి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ దీవిలో స్వతంత్ర ప్రజాస్వామిక ప్రభుత్వం ఉంది. దీనిని బెదిరించడం కోసం చైనా తరచూ యుద్ధ విమానాలను పంపిస్తూ ఉంటుందనే సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

United Nations : మహిళల అణచివేతలో ఆఫ్ఘనిస్థాన్‌దే పైచేయి : ఐరాస

Cryptocurrency : అవినీతి భరతం పట్టేందుకు మోదీ మరో కఠిన నిర్ణయం

Updated Date - 2023-03-09T16:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising