ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Elon Musk: ఇది సిగ్గుమాలిన చర్య అంటూ ట్రూడోపై ధ్వజమెత్తిన ఎలాన్ మస్క్.. కారణం ఇదే!

ABN, First Publish Date - 2023-10-02T15:33:41+05:30

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయనను అనుకోని చిక్కుల్లో నెడుతున్నాయి. ఇప్పటికే భారత్‌పై చేసిన ఆరోపణలు, మాజీ నాజీని సత్కరించడం వంటి వాటివల్ల ప్రపంచవ్యాప్తంగా...

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయనను అనుకోని చిక్కుల్లో నెడుతున్నాయి. ఇప్పటికే భారత్‌పై చేసిన ఆరోపణలు, మాజీ నాజీని సత్కరించడం వంటి వాటివల్ల ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా తీసుకున్న మరో నిర్ణయం సైతం ఆయన్ను చిక్కుల్లో పడేసింది. ‘వాక్ స్వాతంత్రాన్ని’ హరించేస్తున్నారంటూ జనాలు భగ్గుమంటున్నారు. ప్రపంచ కుబేరుడు, X బాస్ ఎలాన్ మస్క్ కూడా ట్రూడోపై విరుచుకుపడ్డారు. ట్రూడో సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు.

అసలు ఏమైందంటే.. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ కంపెనీలు ‘రెగ్యులేటరీ కంట్రోల్స్’ కోసం కచ్ఛితంగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని ట్రూడో ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం గురించి ప్రముఖ జర్నలిస్ట్ గ్లెన్ గ్రీన్‌వాల్డ్ ట్విటర్‌ (X ప్లాట్‌ఫార్మ్)లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో అత్యంత అణచివేతతో కూడిన ఆన్‌లైన్ సెన్సార్‌షిప్ నిబంధనలు కెనడాలో ఉన్నాయని.. పాడ్‌కాస్ట్‌లను అందించే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థలపై నియంత్రణ కోసం ట్రూడో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని.. ఇందులో భాగంగా ఆయా కంపెనీలు ప్రభుత్వం వద్ద అధికారికంగా నమోదు చేసుకోవాలని ఆదేశించిందని గ్లెన్ తన పోస్టులో రాసుకొచ్చారు.


ఆ ట్వీట్‌ని ఎలాన్ మస్క్ రీట్వీట్ చేస్తూ.. ఇది సిగ్గుచేటు చర్య అని ట్రూడోని విమర్శించారు. ‘‘కెనడాలో వాక్ స్వాతంత్రాన్ని అణచివేసేందుకు ట్రూడో ప్రయత్నిస్తున్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు’’ అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. కాగా.. ట్రూడో ప్రభుత్వం వాక్ స్వేచ్ఛపై దాడి చేస్తోందంటూ విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదు. కొవిడ్‌ వ్యాక్సిన్లను తప్పనిసరి చేస్తూ 2022 ఫిబ్రవరిలో కెనడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. అక్కడి ట్రక్కు డ్రైవర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు ట్రూడో ప్రభుత్వం వారి ఆందోళనల్ని అణచివేసేందుకు గాను.. కెనడా చరిత్రలోనే తొలిసారి తొలిసారి ఎమర్జెన్సీని అమలు చేశారు.

మరోవైపు.. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని ట్రూడో ఆరోపణలు చేయడంతో పాటు భారత దౌత్యాధికారిని బహిష్కరించడంతో.. వివాదం రాజుకుంది. దీంతో.. భారత్ కూడా కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ట్రూడో ఆరోపణల్ని తిరస్కరించడంతో పాటు ఇక్కడున్న కెనడా దౌత్యాధికారిని తిరిగి వెనక్కు పంపింది. అంతేకాదు.. ట్రూడో చేసిన ఆరోపణలకు కచ్ఛితమైన సమాచారం అందించాలని నిలదీసింది. అయితే.. కెనడా నుంచి మాత్రం స్పందన లేదు.

Updated Date - 2023-10-02T15:33:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising