Pakistan: పాక్‌లో సంచలనం... మాజీ మంత్రి షేక్ అహ్మద్ అరెస్ట్
ABN, First Publish Date - 2023-02-02T08:16:35+05:30
పాకిస్థాన్ మాజీ అంతర్గత శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌ను ఆ దేశ పోలీసులు అరెస్ట్....
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ అంతర్గత శాఖ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ చీఫ్ షేక్ రషీద్ అహ్మద్‌ను ఆ దేశ పోలీసులు గురువారం తెల్లవారుజామున ముర్రీ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద అరెస్టు చేశారు.(Pakistan)షేక్ రషీద్ అహ్మద్ (Sheikh Ahmed)వద్ద నుంచి మద్యం బాటిల్, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, అరెస్టు(Arrest) సమయంలో మంత్రి మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు పథకం పన్నారని ఆబ్పారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినందుకు మాజీ మంత్రిని(Former Pakistan Interior minister) పోలీసులు విచారణకు పిలిచిన తర్వాత అరెస్టు చేశారు.
‘‘పంజాబ్ ప్రావిన్స్‌లోని నివాసం నుంచి షేక్ రషీద్ అహ్మద్‌ను అరెస్టు చేశారు. ఇస్లామాబాద్ పోలీసులు 400 మంది మంత్రి ఇంట్లోకి ప్రవేశించి, కిటికీలు పగలగొట్టి, కొట్టి, కస్టడీలోకి తీసుకున్నారు’’ అని మాజీ మంత్రి తరపున ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.సాయుధ పోలీసులు తనను అరెస్టు చేసిన సందర్భంగా తన పిల్లలు, సేవకులను కొట్టారని, ఇంటిని ధ్వంసం చేశారని రషీద్ అహ్మద్ ఆరోపించారు.
తనను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, తన అరెస్టు వెనుక ప్రస్తుత అంతర్గత మంత్రి రాణా సనావుల్లా పాత్ర ఉందని అహ్మద్ ఆరోపించారు. మియాన్ తాహిర్ కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ పోలీసులు తనను అరెస్టు చేశారని రషీద్ అహ్మద్ విమర్శించారు.తన సన్నిహితుడి అరెస్టును పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విటర్‌లో ఖండించారు.
Updated Date - 2023-02-02T08:30:48+05:30 IST