ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చేతిలో చెయ్యేసి నడిచిన ‘రా’ మాజీ చీఫ్

ABN, First Publish Date - 2023-01-03T18:17:52+05:30

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో’ (Bharat Jodo Yatra)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో’ (Bharat Jodo Yatra) యాత్ర 9 రోజుల విరామం తర్వాత నేడు (మంగళవారం) తిరిగి మొదలైంది. ఈ యాత్రలో భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (R&AW) మాజీ చీఫ్ అమర్‌జీత్ సింగ్ దులత్( Amarjit Singh Dulat) పాల్గొని రాహుల్ వెంట నడిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్‌లో పంచుకుంది. ఢిల్లీలోని బాబర్‌పూర్ ప్రాంతంలో రాహుల్ గాంధీ చేతిలో చేయి వేసి అమర్‌జీత్ సింగ్ నడిచారు.

కాగా, డిసెంబరులో రాజస్థాన్‌లో జరిగిన భారత్ జోడో యాత్రలో భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్(Raghuram Rajan).. రాహుల్‌తో కలిసి నడిచారు. అదే నెల 24న ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (MNM) చీఫ్ కమల్ హాసన్ (Kamal Haasan) కూడా రాహుల్‌ యాత్రలో పాల్గొని ఆయనతోపాటు కలిసి నడిచారు. అంతకుముందు బాలీవుడ్ నటులు పూజా భట్, స్వర భాస్కర్ తదితరులు కూడా రాహుల్‌తో అడుగులు కదిపారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మంగళవారం ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వద్ద తిరిగి ప్రారంభమైన తర్వాత ఘజియాబాద్‌లోని లోని సరిహద్దు గుండా ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 5వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లో యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత హర్యానాలోకి ప్రవేశిస్తుంది. ఆ రాష్ట్రంలో జనవరి 10వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం పంజాబ్‌లో అడుగుపెడుతుంది.

Updated Date - 2023-01-03T18:17:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising