ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Brazil : బ్రెజిల్‌లో భారీవర్షాలు...వెల్లువెత్తిన వరదలు, విరిగిపడిన కొండచరియలు...26 మంది మృతి

ABN, First Publish Date - 2023-02-20T09:53:56+05:30

బ్రెజిల్ దేశంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 26 మంది మృత్యువాత పడ్డారు....

Heavy Rains in Brazil
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సావో పౌలో(బ్రెజిల్): బ్రెజిల్ దేశంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 26 మంది మృత్యువాత పడ్డారు. (Heavy Rains in Brazil)ఉత్తర సావోపౌలో రాష్ట్రంలోని రెండు నగరాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు వెల్లువెత్తడంతోపాటు కొండచరియలు విరిగిపడ్డాయి.(Flooding, Landslides) ఈ వరదలతోపాటు కొండచరియలు విరిగిపడటం వల్ల 26 మంది మరణించినట్లు ఉబాతుబా మేయర్ చెప్పారు. వరదల వల్ల సావో సెబాస్టియో, ఉబాతుబా,లహబెలా, బెర్టిగా నగరాలు అతలాకుతలమయ్యాయి. వరదల బారిన పడిన బాధితుల కోసం సహాయ బృందాలు రంగంలోకి దిగాయి.

సావో సెబాస్టియో నగరంలో కొండచరియలు విరిగిపడటంతో 12 మంది గల్లంతు అవ్వగా, 50 ఇళ్లు కుప్పకూలిపోయాయి. వరదల్లో చిక్కుకున్న బాలికను సహాయబృందాలు కాపాడాయి. బ్రెజిల్ దేశంలోని కొన్ని నగరాల్లో ఒక్క రోజులోనే 687 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని దీంతో వరదలు సంభవించాయని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సీయో లులా దా సిల్వ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి : Two Wives Fight: ఇద్దరు భార్యల మధ్య రాజుకున్న గొడవ కాల్పులకు దారితీసింది...చివరికి భర్తకు ఏమైందంటే...

వరద పీడిత ప్రాంతాలను తాను సోమవారం సందర్శిస్తానని ఆయన చెప్పారు. వరద సహాయ పనుల కోసం ఆర్మీతో పాటు రెండు విమానాలను రంగంలోకి దించామని బ్రెజిల్ అధికారులు చెప్పారు. వరదలతో జనం చిన్న పడవల్లో సురక్షిత ప్రాంతాలకు వస్తున్నారు. వరదల వల్ల కార్నివాల్ ను రద్దు చేశారు. వరదలతో పర్యాటక రంగానికి తీరని దెబ్బ తగిలినట్లయింది.

Updated Date - 2023-02-20T10:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising