ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hong Kong Rains: దంచికొట్టిన భారీ వర్షాలు.. నీటమునిగిన హాంకాంగ్ నగరం

ABN, First Publish Date - 2023-09-08T16:11:59+05:30

దక్షిణ చైనాలోని హాంకాంగ్ నగరంలో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ వర్షాలు దంచికొట్టాయి. ఈ దెబ్బకు.. నగరమంతా చెరువులా మారింది. వీధులు, సబ్‌వేలు నీటమునిగాయి. గురువారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు...

దక్షిణ చైనాలోని హాంకాంగ్ నగరంలో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ వర్షాలు దంచికొట్టాయి. ఈ దెబ్బకు.. నగరమంతా చెరువులా మారింది. వీధులు, సబ్‌వేలు నీటమునిగాయి. గురువారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు 158.1 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు రిపోర్ట్‌లో తేలింది. 1884 తర్వాత ఒక గంట వ్యవధిలో ఇంత వర్షపాతం కువరడం ఇదే మొదటిసారి. 140 ఏళ్లలో హాంకాంగ్ నగరం ఈ స్థాయిలో కుంభవృష్టి చూడలేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇక క్వోలూన్, నగర ఉత్తర ప్రాంతంలో అయితే ఇంతకన్నా ఎక్కువగా వర్షం పడింది. అక్కడ రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రిలోపు 200 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల 24 గంటల్లో 19.5 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

కొన్ని రోజుల క్రితమే ఈ హాంకాంగ్ నగరం బలమైన టైఫూన్ కారణంగా అతలాకుతలం చేసింది. దాన్నుంచి ఇంకా కోలుకుంటుండగానే.. తాజాగా ఈ భారీ వర్షాలు తీవ్రంగా దెబ్బకొట్టాయి. వరదల కారణంగా నగరంలో చాలాచోట్ల రవాణా సేవలు, వ్యాపారాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాంగ్‌తాయ్‌ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్‌ నీటమునగడంతో.. రైల్వే శాఖ కూడా సేవలను నిలిపివేసింది. ఈ హాంకాంగ్ నగరాన్ని క్వోలూన్‌ ద్వీపకల్పంతో అనుసంధానించే మార్గం కూడా వరదల్లో చిక్కుకుపోయింది. ఈ నగరంలో మొత్తం 75 లక్షల మంది జీవిస్తుండగా.. ఈ వరదల కారణంగా చాలామంది నిరాశ్రయులయ్యారు. గత 24 గంటల్లో 83 మంది ఆసుపత్రిపాలవ్వగా.. ఇద్దరు మృతి చెందినట్టు అత్యవసర విభాగం అధికారులు వెల్లడించారు. నీట మునిగిన ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలు కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం అర్థరాత్రి వరకు వరద తీవ్రత తగ్గే అవకాశం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి.


నిజానికి.. హాంకాంగ్ నగరంలో అతిపెద్ద వర్షపాతం నమోదు అవుతుందని గురువారం సాయంత్రమే వాతావరణ శాఖ వెల్లడించింది. ‘బ్లాక్’ అలర్ట్‌ని జారీ చేసింది. అత్యవసరమైన ఉద్యోగులను మాత్రమే కార్యాలయాలకు పిలిపించాలని.. మిగిలిన వాళ్లు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాంటప్పుడు ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదంటూ ఆన్‌లైన్‌లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ భారీ వర్షం దెబ్బకు నగరమంతా అతలాకుతలమవ్వడంతో.. అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు.. హాంకాంగ్ నంబర్ 2 అధికారి ఎరిక్ చాన్ మాట్లాడుతూ.. ఈ వర్షపాతం అంచనాను టైఫూన్‌తో పోల్చలేమని, పరిస్థితిని పరిష్కరించేందుకు వివిధ విభాగాలు రాత్రంతా పని చేశాయని అన్నారు. కాగా.. వీధులు నీటమునిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీధుల్ని నావిగేట్ చేయడానికి రెస్క్యూ బృందాలు తెప్పలను ఉపయోగిస్తున్నాయి.

కేవలం హాంకాంగ్ నగరంలోనే కాదు.. దక్షిణ చైనాలోని షెన్‌జెన్‌ నగరంలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. 1952 తర్వాత అక్కడ ఈ స్థాయిలో వర్షపాతం నమోదవ్వడం ఇదే మొదటిసారి. ఈ వర్షాల దెబ్బకు గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో వందల కొద్దీ విమానాలను రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాలన్నీ వరదలతో మునిగిపోయే ప్రమాదం ఉందని, కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు.. అధికారులకు సైతం సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2023-09-08T16:11:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising