Modi Assure Zelensky: యుద్ధం పరిష్కారానికి కృషి చేస్తాం: జెలెన్‌స్కీకి మోదీ హామీ
ABN, First Publish Date - 2023-05-20T20:40:44+05:30
టోక్యో: ఉక్రెయిన్, రష్యా వివాదాన్ని మానవత్యానికి, మానవతా విలువలకు సంబంధించిన అంశంగా తాము భావిస్తున్నామని, దీనికి పరిష్కారం కనుగొనేందుకు కృషి చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. జపాన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సు క్రమంలో ఉభయ నేతలు భేటీ అయ్యారు.
టోక్యో: ఉక్రెయిన్, రష్యా వివాదాన్ని మానవత్యానికి, మానవతా విలువలకు సంబంధించిన అంశంగా తాము భావిస్తున్నామని, దీనికి పరిష్కారం కనుగొనేందుకు కృషి చేస్తామని ఉక్రెయిన్ (Ukrain) అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy)కి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హామీ ఇచ్చారు. జపాన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సు (G-7 Summit) క్రమంలో ఉభయ నేతలు భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌పై గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి ఈ ఇద్దరు నేతలు నేరుగా కలుసుకోవడం ఇదే ప్రథమం. గతంలో వీరిరువురూ ఫోన్‌లో వర్చువల్ తరహాలో మాట్లాడుకున్నారు.
''ఉక్రెయిన్‌లో యుద్ధం యావత్ ప్రపంచానికి పెద్ద అంశం. దీని ప్రభావం ప్రపంచ దేశాలపై పలు విధాలుగా పడింది. అయితే, ఈ యుద్ధాన్ని రాజకీయ సమస్యగానో, ఆర్థిక సమస్యగానో నేను చూడటం లేదు. ఇది నాకు మానవత్వానికి, మానవ విలువలకు సంబంధించిన అంశం. యుద్ధం వల్ల కలిగే కష్టనష్టాలేమిటో మాకంటే మీకే బాగా తెలుసు. గత ఏ ఏడాది ఉక్రెయిన్ నుంచి మా భారత విద్యార్థులు తిరిగి వచ్చినప్పుడు అక్కడి సాదకబాధకాలను వారు తెలియజేశారు. మీ ప్రజల ఆవేదన కూడా నాకు తెలుసు. సమస్యను చక్కదిద్దేందుకు మా పరిధిలో ఏమి చేయగలమో అదంతా చేయడానికి భారతదేశం, వ్యక్తిగతంగా నేను సిద్ధంగా ఉన్నాం'' అని జెలిన్‌స్కీతో జరిగిన భేటీలో మోదీ భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మోదీతో పాటు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పోటోను ప్రధానిమంత్రి కార్యాలయం షేర్ చేసింది.
Updated Date - 2023-05-20T20:40:44+05:30 IST