Pakistan : పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న ఐఎంఎఫ్
ABN, First Publish Date - 2023-03-17T16:03:27+05:30
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) కఠినమైన ఆంక్షలను
ఇస్లామాబాద్ : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) కఠినమైన ఆంక్షలను పెడుతోంది. సైనిక వ్యయం, రక్షణ బడ్జెట్‌లో 15 శాతం కోత విధించాలని; లాంగ్ రేంజ్ న్యూక్లియర్ మిసైల్ ప్రోగ్రామ్‌ను నిలిపేయాలని, చైనా నుంచి తీసుకున్న రుణాలపై థర్డ్ పార్టీ లేదా అంతర్జాతీయ ఆడిట్ జరిపించాలని గట్టిగా చెప్తోంది. దీంతో పాక్-ఐఎంఎఫ్ మధ్య తాజా చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి.
పాకిస్థాన్ (Pakistan)కు చైనా (China) ఇచ్చిన రుణాలు, సీపీఈసీ పెట్టుబడులపై అంతర్జాతీయ లేదా థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని ఐఎంఎఫ్ డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్ష పార్టీల నేతలు రాజకీయ స్థిరత్వంపై హామీ ఇవ్వాలని కోరుతోంది.
ఇదిలావుండగా, పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ గురువారం స్పెషల్ సెనేట్ సెషన్‌లో మాట్లాడుతూ, లాంగ్ రేంజ్ న్యూక్లియర్ మిసైల్స్‌ను తాము వదులుకునేది లేదన్నారు. తమకు ఏ రేంజ్ మిసైల్స్ ఉండాలో చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు.
ఇవి కూడా చదవండి :
weddings: భర్తలతో పాటు భార్యలకు కూడా తప్పడం లేదు..
Karnataka : బంగ్లాదేశీయుల రాకతో మన సంస్కృతికి ముప్పు : హిమంత బిశ్వ శర్మ
Updated Date - 2023-03-17T18:18:16+05:30 IST